Telugu Global
Others

బాబు క‌న్నా నాలుగాకులు ఎక్కువే చ‌దివింది...

అత్తింట్లో టాయిలెట్ లేక‌పోతే పుట్టింటికి చెక్కెయ‌మ‌ని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు. ఆయ‌న క‌న్నా నాలుగాకులు ఎక్కువే చ‌దివింది బీహార్‌లోని సునీతాదేవి అనే ఓ మ‌హిళ. ఇంట్లో టాయిలెట్ కట్టించాలని పెళ్ళ‌యిన‌ప్ప‌టి నుంచి మొత్తుకుంటున్నా… ఇదిగో, అదిగో అంటూ గ‌డిపేస్తున్న భ‌ర్త ప్ర‌వ‌ర్త‌నకు విసుగెత్తిన ఆ గృహిణి చివరికి విడాకులిచ్చేసింది. వైశాలి జిల్లా (బీహార్) పహార్‌పూర్‌లో సునీతా దేవి (25) చూపిన తెగువకు గ్రామస్థులంతా విస్మయం చెందారు. టాయిలెట్ కట్టిస్తానని ఎన్నోసార్లు హామీ ఇచ్చి విఫలమైన […]

అత్తింట్లో టాయిలెట్ లేక‌పోతే పుట్టింటికి చెక్కెయ‌మ‌ని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చంద్ర‌బాబు పిలుపు ఇచ్చారు. ఆయ‌న క‌న్నా నాలుగాకులు ఎక్కువే చ‌దివింది బీహార్‌లోని సునీతాదేవి అనే ఓ మ‌హిళ. ఇంట్లో టాయిలెట్ కట్టించాలని పెళ్ళ‌యిన‌ప్ప‌టి నుంచి మొత్తుకుంటున్నా… ఇదిగో, అదిగో అంటూ గ‌డిపేస్తున్న భ‌ర్త ప్ర‌వ‌ర్త‌నకు విసుగెత్తిన ఆ గృహిణి చివరికి విడాకులిచ్చేసింది. వైశాలి జిల్లా (బీహార్) పహార్‌పూర్‌లో సునీతా దేవి (25) చూపిన తెగువకు గ్రామస్థులంతా విస్మయం చెందారు. టాయిలెట్ కట్టిస్తానని ఎన్నోసార్లు హామీ ఇచ్చి విఫలమైన భర్తతో తాను కాపురం చేయలేనని ఆమె పంచాయతీ పెద్దల సమక్షంలో తేల్చి చెప్పింది. విడాకులు తప్ప తనకు మరో మార్గం లేనందున భర్తను వీడి వెళుతున్నట్లు స్పష్టం చేసింది. ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో చీకటి పడితే తప్ప బహిర్భూమికి వెళ్లే పరిస్థితి లేదని, పొలాల యజమానుల నుంచి దుర్భాషలు వినాల్సి వస్తోందని ఆమె పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన త‌ర్వాత‌ నాలుగేళ్లుగా ప్రాధేయపడుతున్నా కూరగాయల వ్యాపారి అయిన తన భర్త ధీరజ్ చౌదురి ఏ మాత్రం పట్టించుకోకపోగా, టాయిలెట్ నిర్మాణానికి పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ పరిస్థితుల్లో విడాకులివ్వడం మినహా మరో మార్గం లేదని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉమ్మడి కుటుంబం అంతా తన సంపాదన పైనే ఆధారపడుతోందని, ఆర్థిక సమస్యల వల్లే భార్యకు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోలేకపోయానని ధీరజ్ చెబుతున్నాడు. కాగా, సంపూర్ణ పారిశుద్ధ్య పథకం (నిర్మల్ గ్రామ్ యోజన) కింద 2011లోనే ప్రభుత్వం ఎంపిక చేసిన పహార్‌పూర్‌లో ఈ సంఘటన జరగడం అందరినీ నివ్వెర పరచింది. బీహార్ జనాభా 105 మిలియన్లు కాగా అందులో 22 మిలియన్ల మందికి ఇప్పటికీ టాయిలెట్లు లేవని అధికారులు అంచనా వేశారు

First Published:  14 May 2015 2:08 PM GMT
Next Story