Telugu Global
National

మ‌ళ్లీ పెట్రో మంట‌!

దేశంలో మ‌ళ్లీ పెట్రోలు ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్ పై లీటరుకు రూ. 2.71చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గ‌త నెల 30 వ తేదీన కేంద్రం పెట్రోలు ధ‌ర‌లు పెరిగాయి. 15 రోజుల తేడాతో మ‌రోసారి ధ‌ర‌లు పెర‌గ‌డంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ పెంపు ధ‌ర‌లు శుక్ర‌వారం అర్థ‌రాత్రి నుంచే అమ‌లులోకి వ‌చ్చాయి.  తాజా పెంపుతో పెట్రోలు లీటరు ధర రూ. 75 దాట‌నుంది. దేశంలో అత్య‌ధికంగా […]

మ‌ళ్లీ పెట్రో మంట‌!
X
దేశంలో మ‌ళ్లీ పెట్రోలు ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్ పై లీటరుకు రూ. 2.71చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గ‌త నెల 30 వ తేదీన కేంద్రం పెట్రోలు ధ‌ర‌లు పెరిగాయి. 15 రోజుల తేడాతో మ‌రోసారి ధ‌ర‌లు పెర‌గ‌డంపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ పెంపు ధ‌ర‌లు శుక్ర‌వారం అర్థ‌రాత్రి నుంచే అమ‌లులోకి వ‌చ్చాయి. తాజా పెంపుతో పెట్రోలు లీటరు ధర రూ. 75 దాట‌నుంది. దేశంలో అత్య‌ధికంగా పెట్రోలు ధ‌ర‌లున్న రాష్ట్రాలుగా ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ రికార్డుల‌కెక్కిన సంగ‌తి తెలిసిందే! ఈ వార్త వెలువ‌డిన నుంచే తెలుగు రాష్ర్టాల్లో పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు క‌నిపించాయి. చాలా చోట్ల వాహ‌న‌దారులు బంకుల వ‌ద్ద బారులు తీరారు.
First Published:  15 May 2015 7:59 PM GMT
Next Story