ఆర్టీసీ విభ‌జ‌న‌కు ముహూర్తం ఖ‌రారు!

రెండు తెలుగు రా ష్ట్రాల్లో కీల‌క విభాగ‌మైన ఆర్టీసీ విభ‌జ‌న‌కు రంగం సిద్ధమైంది. ఉద్యోగుల విభ‌జ‌న ఇప్ప‌టికే పూర్తయిన నేప‌థ్యంలో  తాజానిర్ణ‌యంతో మే 28 నుంచి ప‌రిపాల‌న విభాగాలు కూడా వేరుప‌డ‌నున్నాయి. ఈ మేర‌కు ఆర్టీసీ ఎండీ సాంబ‌శివ‌రావు శ‌నివారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో ఏ బ్లాక్‌ను ఆంధ్ర‌కు, బి-బ్లాక్‌ను తెలంగాణ‌కు కేటాయించారు. ఈడీలు, ఆర్ ఎంల స‌హా అన్ని  ర‌కాల ఉద్యోగుల విభ‌జ‌న ఇప్ప‌టికే పూర్త‌యింది. వాస్త‌వానికి మే 14నే విభ‌జ‌న జ‌ర‌గాల్సి ఉన్నా కార్మికుల స‌మ్మెతో వాయిదా ప‌డింది. ఉమ్మ‌డి ఆస్తుల‌పై 25న నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.