సన్నీ లియోన్పై కేసు!

తన అందాలతో యువతకు నిద్రలేకుండా చేస్తున్న బాలీవుడ్ సెక్స్బాంబ్ సన్నీలియోన్పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఇంటర్నెట్లో అశ్లీతను ప్రచారం చేస్తోందంటూ థానెకు చెందిన ఓ గృహిణి సన్నిలియోన్పై స్థానిక డోంబివిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాజీ పోర్న్స్టార్ అయిన సన్నీలియోన్ చిత్రాలు, వీడియోలు అశ్లీలంగా ఉన్నాయని, అవి యువత ఆలోచనలను పక్కదారి పట్టించే ప్రమాదముందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు కేసును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు.పాపం! అసలే ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సన్నీకి ఈ వివాదం మరింత ప్రచారం తెస్తుందా?  లేదా మరిన్ని చిక్కులు ఎదురవుతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.