సంక్రాంతికి వ‌స్తున్న ఆటో జానీ ?

చిరంజీవి 150వ చిత్రం ఆటోజానీ త్వరలోనే పట్టాలెక్కనుంది. సినిమాకు దర్శకుడు, నిర్మాత ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు హీరోయిన్ ఎవరన్న చర్చ నడుస్తోంది. చిరంజీవి ఏజ్, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే సరిగ్గా నప్పుతారోనని హీరోయిన్ వేట మొదలైందని వినికిడి. చిరంజీవి చివరిసారిగా నటించిన చిత్రం శంకర్ దాదా జిందాబాద్లో హీరోయిన్ ఎంపిక సరిగా జ‌ర‌గ‌లేదంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి అలాంటివి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కావడంతో చిత్రం భారీ బడ్జెట్లో ఉంటుందని టాక్ నడుస్తోంది. సినిమాను 2-3 నెలల్లో పూర్తి చేసే దర్శకుడు పూరీ. మరి ఈ సినిమాను అదే వేగంతో పూర్తి చేస్తారా?  లేదా 150 వ చిత్రం కావడంతో ఏమైనా జాప్యం జరుగుతుందా అన్నది వేచి చూడాలి. కానీ పూరీ మాత్రం స్ర్కిప్టు పక్కాగా ఉందని దసరా తరువాత షూటింగ్ మొదలైతే సంక్రాంతికి విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే!