పవన్, రజనీకాంత్ కొత్త సినిమాలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఓ అదిరిపోయే కథ సిద్ధమైంది. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం ఏకంగా రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు.. దర్శకుడు లారెన్స్. గంగతో తాజాగా మరో విజయం అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్, సూపర్ స్టార్లపై కన్నేశాడు. వాళ్ల కోసం స్టోరీలు సిద్ధంచేసినట్టు తెలిపాడు. త్వరలోనే అపాయింట్ మెంట్ తీసుకొని ఇద్దరికీ కథలు వినిపిస్తాడట. వాళ్లలో ఎవరు ఒప్పుకుంటే వాళ్లతో సెట్స్ పైకి వెళ్లిపోవడమే ఆలస్యం అంటున్నాడు. మరి లారెన్స్ కథలు ఆ బడా హీరోల్ని మెప్పిస్తాయా..
       లారెన్స్ సినిమాలు ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. పక్కా మాస్-మసాలాస్ దట్టించి ఉంటాయి. కుదిరితే ఇంకాస్త ఎక్కువ ఓవరాక్షనే ఉంటుంది. మరి అలాంటి కథలకు పవన్ కల్యాణ్ ఓకే చెబుతాడా.. కచ్చితంగా చెప్పడు. ఏదో కొత్తదనం, ఇంకాస్త సెన్సిబిలిటీ ఉంటేనే కథలు ఒప్పుకుంటున్నాడు పవన్. బంగారం, అన్నవరం సినిమాల టైమ్ కే పక్కా మాస్ కథలు వదిలేశాడు. అటు రజనీకాంత్ ది కూడా అదే స్టయిల్. ఒన్ అండ్ ఓన్లీ మాస్ అంటే ఇష్టపడడం లేదు రజనీకి. కాస్త స్టయిల్ తో పాటు కథలో ఇంకాస్త ఫ్రెష్ నెస్ ఉంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకున్నానంటున్నాడు లారెన్స్.