చిరంజీవి తో న‌య‌న చేయ‌డం లేదా?  

చిరు 150వ చిత్రంలో హీరోయిన్ న‌య‌న‌తార అని నిన్న‌టివ‌ర‌కు గాసిప్స్ చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ మాత్రం  అస‌లు హీరోయిన్ విష‌యం  ఇంకా ఫోక‌స్ చేయ‌లేదు..  ఫ‌స్ట్ క‌థను సిద్దం చేస్తున్న‌ట్లు చెప్పారు.  హీరోయిన్ విష‌యంలో వ‌చ్చేవ‌న్ని రూమ‌ర్స‌ని కొట్టి పారేశారు. అయితే మెగాస్టార్ అభిమానులు చిరు 150వ సినిమాను పూరీ జ‌గ‌న్నాధ్ డైరెక్ట్ చేయ‌డం ప‌ట్ల ఆందోళ‌న చెందుతున్నారు. ఎందుకంటే .. పూరీ హీరోయిజ‌మ్.. పూరీ జ‌గ‌న్నాధ్ రాసే సంభాష‌ణలు చిరంజీవి వంటి సీనియ‌ర్ హీరోకు పెద్ద‌గా సెట్ కావ‌ని వారి భావ‌న. అయితే  డైరెక్ట‌ర్ పూరీ కూడా అంద‌రి అంచ‌నాల్ని తారుమారు చేస్తూ ..చిరంజీవి 150 వ సినిమాను అద్భుతంగా మ‌లిచి ఘ‌న విజయం సాధించ‌డానికి వ‌ర్క్‌వ‌ట్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. దాదాపు 7 సంవ‌త్స‌రాల త‌రువాత మేక‌ప్ వేసుకోవ‌డానికి సిద్దం అవుతున్నచిరు…త‌న 150వ చిత్రం కెరీర్లో ఒక మైలు రాయిగా నిల‌వాల‌ని ఆశిస్తున్నారు. అందుకే  హీరోయిన్ హంట్ స‌ప‌రేట్‌గా సాగుతుంది. ముందు క‌థ‌ను బ‌లంగా త‌యారు చేయ‌డం పైనే  ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు ఆయ‌న‌ స‌న్నిహితులు చెబుతున్నారు.