Telugu Global
Others

ఏపీలో పి.ఎఫ్. ఆఫీసు: ద‌త్తాత్రేయ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నట్లు కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి ద‌త్తాత్రేయ తెలిపారు. దీనికి విజ‌య‌వాడ‌లో స్థ‌లం కోరుతున్నామ‌ని ఆయ‌న అన్నారు.  ఏపీలో తిరుపతి, కర్నూల్‌లలో కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయ‌న చెప్పారు. పీఎఫ్‌ (ప్రావిడెంట్ ఫండ్) యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వచ్చేనెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.  పీఎఫ్‌ కార్యాలయంలో […]

ఏపీలో పి.ఎఫ్. ఆఫీసు: ద‌త్తాత్రేయ‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నట్లు కేంద్ర కార్మిక‌శాఖ మంత్రి ద‌త్తాత్రేయ తెలిపారు. దీనికి విజ‌య‌వాడ‌లో స్థ‌లం కోరుతున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఏపీలో తిరుపతి, కర్నూల్‌లలో కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయ‌న చెప్పారు. పీఎఫ్‌ (ప్రావిడెంట్ ఫండ్) యూనివర్సల్‌ అకౌంట్‌ నెంబర్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వచ్చేనెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పీఎఫ్‌ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ రీజనల్‌ పీఎఫ్‌ చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎఫ్‌కు ఆధార్‌ అనుసంధానం చేయడం వల్ల కార్మికులకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. అన్ని రకాల పీఎఫ్‌ ఖాతాల చెల్లింపులు ఇక నుంచి 20 రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. పీఎఫ్‌ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 300 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. ప్రమోషన్ల అంశం కూడా పెండింగ్‌లో ఉందని, త్వరలో ఢిల్లీలో సమీక్షా సమావేశాలను నిర్వహించి ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో 39,734 పరిశ్రమలు ఉండగా, 85 లక్షల 67వేల మంది పీఎఫ్‌ ఖాతాదారులున్నారని, ఏపీలో 35,218 పరిశ్రమలకుగాను, 34 లక్షల 64 వేల మంది ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో పటాన్‌చెరు, కూకట్‌పల్లిలో పీఎఫ్‌ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తామని ఇందుకోసం స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరనున్నట్లు తెలిపారు.
First Published:  16 May 2015 2:12 AM GMT
Next Story