సంపూ అంచనాలను అందుకుంటాడా?

తొలిచిత్రం ‘హృదయ కాలేయం’తో టాలీవుడ్లో భూకంపం సృష్టించిన హీరో ‘సంపూర్ణేష్ బాబు’. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తొలిచిత్రంతోనే లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన స్టెప్పులు, ఫైట్లు చూసి డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు ఇప్పుడు సంపూను హీరోగా పెట్టి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి విశేష‌ స్పందన వస్తోంది. మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సినిమాను భారీ హిట్ చేయాలన్న తాపత్రయం ట్రైలర్లో కనిపిస్తోంది. పెద్దస్టార్లను అనుకరిస్తూ సంపూ చెప్పిన డైలాగులకు మంచి స్పందన వస్తోంది. ఈ సారి సంపూ తొలి చిత్రం స్థాయిలో  హిట్ కొడతాడా?  లేకుంటే అంతకంటే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటాడా? అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. చిత్రం టైటిల్, డైలాగులు వెరైటీగా ఉన్నాయి. సంపూ నటన ఈ సినిమాకు ప్రాణం అని విష్ఱు ఇప్పటికే ప్రకటించాడు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి మే 28న విడుదల కానున్న సింగం 123తో అందరి అంచనాలను సంపూ ఏ మేరకు అందుకుంటాడో చూడాలి…!