Telugu Global
Others

చంద్రబాబు చాలా మారిపోయాడు

రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయాక, పార్టీ ఓటమికి తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు వైపే వేలెత్తి చూపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో “నేను చాలా మారాను, మీరూ మారండి”, “నేను మారిన చంద్రబాబుని” అని పదేపదే అనేవాడు.             2014 ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ ఆయన ధోరణి చూసి చంద్రబాబు ఏం మారలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మారినట్లు కనిపించాడంతే! అధికారంతో పాటే మళ్ళీ పాత లక్షణాలన్నీ వచ్చేశాయని కార్యకర్తలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు.             కార్యకర్తల పరిస్థితి అలా […]

చంద్రబాబు చాలా మారిపోయాడు
X

రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయాక, పార్టీ ఓటమికి తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు వైపే వేలెత్తి చూపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో “నేను చాలా మారాను, మీరూ మారండి”, “నేను మారిన చంద్రబాబుని” అని పదేపదే అనేవాడు.

2014 ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ ఆయన ధోరణి చూసి చంద్రబాబు ఏం మారలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మారినట్లు కనిపించాడంతే! అధికారంతో పాటే మళ్ళీ పాత లక్షణాలన్నీ వచ్చేశాయని కార్యకర్తలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

కార్యకర్తల పరిస్థితి అలా ఉంటే, కొందరు అధికారులకు మాత్రం కొన్ని విషయాల్లో పూర్తిగా మారిన చంద్రబాబు దర్శన మిస్తున్నాడు. ఎలా అంటే –

ఎన్‌టిరామారావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ హయాంలో బదిలీలు అంటే కాంగ్రెస్‌ నాయకులకు ఇష్టమైన వాళ్ళని ఇష్టమైన చోటికి, నచ్చని వాళ్ళని శంకరగిరి మాన్యలకు పంపించడం. అదీ సంవత్సరం పొడవునా బదిలీల కాలమే.

రామారావు అధికారంలో స్థిరపడ్డాక అడ్డగోలు బదిలీలు పోయి ఒక పద్ధతి ప్రకారం కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీలు మొదలయ్యాయి. తెలుగుదేశం అధికారం పోయి వై.ఎస్‌. నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డా తెలుగుదేశం ఏర్పరచిన కౌన్సిలింగ్‌ విధానాన్నే కొనసాగించారు. బదిలీలు చట్టబద్ధంగా జరిగాయి. రాజకీయ నాయకుల జోక్యం స్వల్పంగా ఉండేది.

ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కార్యకర్తలు, నాయకులు ఆర్థికంగా స్థిరపడడానికి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రజలు పచ్చచొక్కాల నాయకుల చుట్టూ తిరిగే విధానాలకు తెర తీశాడు. బదిలీల్లో కౌన్సిలింగ్‌ విధానాన్ని ప్రక్కనపెట్టి పాత కాంగ్రెస్‌ విధానాలకు స్వాగతం పలికాడు.

ఇక ఉద్యోగుల, అధికారుల బదిలీల్లో – జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే, పచ్చ చొక్కాల నాయకుల ఇష్టానుసారం బదిలీలు జరిగే అవకాశం ఎక్కువ.

అలాగే చిన్నచిన్న ఉద్యోగ నియామకాల్లోనూ పచ్చ చొక్కాలదే అంతిమ నిర్ణయం కానుంది. ఉదాహరణకు అంగన్‌వాడీ ఉద్యోగుల నియామకాల మార్గదర్శకాలకు సవరణలు చేశారు. రాతపరీక్షకు మార్కులు తగ్గించి, ఇంటర్వ్యూలకు మార్కులు పెంచేశారు. దీంతో ఇక పచ్చచొక్కాల చుట్టూ ప్రదర్శనే ఉద్యోగాలకు అర్హత అవుతుంది. 1983కు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇలానే చేసింది. అందుకే చంద్రబాబులో పాత కాంగ్రెస్‌ వాసనలు పోలేదంటున్నారు అధికారులు.

First Published:  17 May 2015 2:59 AM GMT
Next Story