Telugu Global
Cinema & Entertainment

పాలిటిక్స్‌ను వ‌ద‌ల...!

వ‌డివేలు… మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్రేమ దేశం చిత్రం గుర్తున్న వారికి మాత్రం బాగా గుర్తుంటాడు. త‌మిళ్‌లో మాత్రం స్టార్ కామెడియ‌న్. అయితే   కామెడియ‌న్  స్టేజ్ నుంచి ప్ర‌స్తుతం  హీరోగా చిత్రాలు చేస్తున్న వ‌డివేలు.. ఫ్యూచ‌ర్‌లో మరోసారి పాలిటిక్స్‌లోకి రావ‌డం ఖాయం అంటున్నారు. గ‌తంలో డియంకే పార్టీ తరపున ప్ర‌చారం చేసి వివాదం పాలయ్యాడు. ఇక‌ 22వ  రెండో పుల‌కేశి చిత్రంతో హీరోగా మారిన వ‌డివేలు.. కొంత గ్యాప్ తరువాత తెనాలి రామన్ అనే చారిత్రక […]

పాలిటిక్స్‌ను వ‌ద‌ల...!
X
వ‌డివేలు… మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్రేమ దేశం చిత్రం గుర్తున్న వారికి మాత్రం బాగా గుర్తుంటాడు. త‌మిళ్‌లో మాత్రం స్టార్ కామెడియ‌న్. అయితే కామెడియ‌న్ స్టేజ్ నుంచి ప్ర‌స్తుతం హీరోగా చిత్రాలు చేస్తున్న వ‌డివేలు.. ఫ్యూచ‌ర్‌లో మరోసారి పాలిటిక్స్‌లోకి రావ‌డం ఖాయం అంటున్నారు. గ‌తంలో డియంకే పార్టీ తరపున ప్ర‌చారం చేసి వివాదం పాలయ్యాడు. ఇక‌ 22వ రెండో పుల‌కేశి చిత్రంతో హీరోగా మారిన వ‌డివేలు.. కొంత గ్యాప్ తరువాత తెనాలి రామన్ అనే చారిత్రక కథా చిత్రంలో నటించారు. ఆ చిత్రం పలు విమర్శలు మధ్య విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. కాగా తాజాగా ఎలి అనే చిత్రంలో నటిస్తున్నారు. తెనాలి రామన్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు యువరాజే ఈ చిత్రానికి దర్శకుడు. నటి సదా నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని జి.సతీష్‌కుమార్, ఎస్.అరమనాథ్ నిర్మిస్తున్నారు.
First Published:  17 May 2015 1:53 AM GMT
Next Story