మంత్ ఎండింగ్ లో మజా..మజా..

ఈ మంత్ ఎండింగ్ భలే టాలీవుడ్ భలే మజాగా సాగబోతోంది. అంచనాలు పెంచే కొన్ని సినిమాలతో పాటు.. ఈగర్ గా వెయిట్ చేస్తున్న మరికొన్ని సినిమాల ఆడియో ఫంక్షన్లన్నీ నెలాఖరుకే ఫిక్స్ అయ్యాయి. రామ్-రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పండగ చేస్కో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మే 29న విడుదల చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు నిర్మాతలు.
అటు అదే రోజున అసుర సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు నారా వారి హీరో రోహిత్. ఇప్పటికే ట్రయిలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు అదే రోజున పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా గబ్బర్ సింగ్-2ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.
ఇక మంత్ ఎండింగ్ లో అంటే మే 31న ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా ఆడియో ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. మరోవైపు సూర్య కూడా మే 28న తన కొత్త సినిమా రాక్షసుడిని తెలుగు ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమౌతున్నాడు. ఇలా మే నెలాఖర్లోనే టాలీవుడ్ సందడి షురూకాబోతోంది.