రణబీర్ కొత్త సినిమాకి హైప్ లేదు

బాలీవుడ్ లో ఏ సినిమా ప్రమోషన్ అయినా హీరోహీరోయిన్లు ఎంచక్కా చెట్టాపట్టాలేసుకొని మీడియా ముందుకొచ్చేస్తారు. నిజంగా లవర్స్ అనేలా భ్రమింపజేస్తారు అందర్నీ. ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎంత ఘాటుగా ఉంటుందో.. ఆఫ్ స్క్రీన్ లో అంటే నిజజీవితంలో కూడా అంతే చనువుగా తిరిగేస్తుంటారు. దీంతో హీరోహీరోయిన్ల మధ్య సమ్ థింగ్ ఏదే నడుస్తోందంటూ పుకార్లు వ్యాపిస్తాయి. సినిమాకి అది బాగా ప్లస్ అవుతుంది. హిందీలో చాలా సినిమా ప్రమోషన్లకు ఇదే పద్దతి ఫాలో అయ్యారు మేకర్స్.
కానీ రణబీర్ కొత్త సినిమాకి మాత్రం ఈ పద్దతి వర్కవుట్ కావట్లేదు. సినిమాలో రణబీర్-అనుష్క శర్మ హీరోహీరోయన్లుగా నటించారు. మాంఛి మసాలా ముద్దు కూడా ఉంది మూవీలో. కానీ ఆ కెమిస్ట్రీని ప్రచారంలో చూపించలేకపోతోంది ఈ జంట. దానికి కారణం ఇద్దరూ వేర్వేరుగా లవ్ లో పడ్డమే. త్వరలోనే కత్రినాను పెళ్లి చేసుకుంటానని రణబీర్ కపూర్ ఏకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు. అటు అనుష్క శర్మ కూడా తక్కువేం కాదు. విరాట్ తో ప్రేమ వ్యవహారాన్ని ఓపెన్ గా మీడియా ముందు ఒప్పుకుంది. దీంతో ఇద్దరి మధ్య ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ కుదరట్లేదు.
రణబీర్ తో క్లోజ్ గా ఉంటే విరాట్ ఫీలవుతాడని అనుష్క భావిస్తుంటే.. అనుష్కతో చనువుగా ఉంటే కత్రినా ఫీలవుతుందని రణబీర్ కూడా ఫీలవుతున్నాడు. దీంతో సినిమా ప్రమోషన్ గాల్లో కలిసిపోయింది. పైగా ఇద్దరితో ప్రమోషన్ చేస్తుంటే.. మీడియా అంతా పెళ్లి-ప్రేమ గురించే అడుగుతోంది తప్ప సినిమా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.