ఇక స‌ల్మాన్ పాటల సంద‌డి!

‘హిట్ అండ్ ర‌న్‌ కేసు’ లో ఊర‌ట ల‌భించ‌డంతో బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ సినిమా పనుల్లో మునిగిపోయాడు. నా సామిరంగా.. అంటూ పాట‌లు పాడటం కూడా సాధ‌న చేస్తున్నాడంట‌. విష‌య‌మేంటంటే.. 1980లో వ‌చ్చిన ‘హీరో’ సినిమా రీమేక్ ప‌నుల్లో త‌ల‌మున‌క‌ల‌య్యాడు. ఈ సినిమాల్లో స‌ల్మాన్ రెండు పాట‌లు కూడా పాడుతున్నాడ‌ట‌. అందుకోసం సాధ‌న చేయాలి క‌దా మ‌రి! అందుకే ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల్ని చేసేందుకు క‌స‌ర‌త్తుల‌తోపాటు, సంగీత సాధ‌ననూ సీరియ‌స్‌గా తీసుకున్నాడ‌ట మ‌నోడు. దీంతో నిర్మాత‌లు, అభిమానులు తెగ‌సంబ‌ర ప‌డిపోతున్నారు. తెర‌పై న‌ట‌న కంటే కండ‌ల‌తోనే ఆక‌ట్టుకునే మ‌నోడు, పాట‌ల‌తో ఏం మాయ చేస్తాడో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.