నా అందాలు చూడమంటున్న సోనాక్షి..

దబాంగ్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హాకి మొదట్లో అన్ని సినిమాలు బాగా కలిసి వచ్చాయి. కాని ఆ తర్వాత సినిమాలు అన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ ముద్దు గుమ్మ కెరీర్ కాస్త స్లో అయ్యింది. ఇక ఈ మద్య టాప్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్‌లకి ఇంట్రస్ట్ చూపడంతో సినిమాలలో కొత్త ట్రెండ్ మొదలు అయ్యింది. కత్రినా కైఫ్, కరీనా,  ప్రియాంక చోప్రా ఇలా వీరందరూ ఐటెం సాంగ్ లు చేసి పాపులర్ అయ్యారు. ఇప్పుడు అదే దారిని సోనా బేబి ఎంచుకుంది.
ఇప్పటికే మూడు సినిమాలలో ఐటెం గాళ్ గా చేసిన సోనా మరో సాంగ్ ఒప్పుకుంది. దీనికి సమాధానంగా  ఒకప్పుడు ఐటెం సాంగ్‌లకి ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్స్ అందరూ ఇప్పుడు ఐటెం గర్ల్స్ గా మారిపోయారు. అందం ఉన్నది అందరికి చూపించడానికే కదా? అందుకే ఐటెం సాంగ్‌ల విషయంపై అంతగా ఆలోచించడం లేదు ‘ అని చెప్పింది. అభిషేక్ బచ్చన్, ఆసిన్ జంటగా నటిస్తున్న’అల్ ఈజ్‌ వెల్’ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది సోనాక్షి.  ఏది చేసినా అభిమానుల గుండెల్లో నిలవాలనేది ఈ సోనా బేబి కోరికట…!