ఐశ్వర్యకు పోటీగా దిగింది

సిల్వర్ స్క్రీన్ పై ఐశ్వర్యరాయ్ కు, సోనమ్ కపూర్ కు ఎక్కడా పోటీ ఎదురుకాలేదు. ప్రస్తుతం ఉన్న స్టేటస్ సింబల్స్ ప్రకారం చూసుకున్నప్పటికీ ఐష్, సోనమ్ మధ్య పోటీ లేదు. కానీ ప్రతి ఏటా ఐశ్వర్యరాయ్ కు పోటీనిస్తోంది సోనమ్ కపూర్. అది కూడా బాలీవుడ్ లో కాదు… కేన్స్ చిత్రోత్సవంలో. అవును.. కేన్స్ లో ఐష్ కు పోటీనిచ్చే ఏకైక ఫ్రెష్ బ్యూటీ సోనమ్ కపూర్. ఐష్ ఇప్పటికే కేన్స్ రెడ్ కార్పెట్ పై హొయలు ఒలికించింది. ఇప్పుడు తాజాగా సోనమ్ సీన్ లోకి ఎంటరైంది. ఒక రోజు ఆలస్యంగా చిత్రోత్సవానికి హాజరైన సోనమ్.. వచ్చిన మొదటి రోజు నుంచి కెమెరాల్ని ఆకర్షించడం ప్రారంభించింది. అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన చీరను కట్టుకుని అందాలు ఒలకబోసింది. సోనమ్ ఫిజిక్, ఇండియన్ స్టయిల్ చూసి టోటల్ ఫారిన్ మీడియా అంతా నోరెళ్లబెట్టింది. అలా మొదటి రోజు నుంచే తన హవా ప్రారంభించింది సోనమ్ కపూర్. సో.. ఈరోజు నుంచి కేన్స్ లో ఐష్ కు పోటీగా ఎక్కడపడితే అక్కడ సోనమ్ కూడా ప్రత్యక్షమౌతుందన్నమాట.