Telugu Global
NEWS

జిల్లాకో ఇన్‌ఛార్జి మంత్రి... టీడీపీలో ఆందోళన..

జిల్లాల్లో అభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణకు ఇన్‌ఛార్జి మంత్రుల వ్యవహారాన్ని చంద్రబాబు తెర‌పైకి తెచ్చారు. కింది స్థాయిలో కార్యకర్తల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని జిల్లాకో మంత్రిని ఇన్‌ఛార్జిగా నియ‌మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ఇన్‌ఛార్జి మంత్రి స్థానికంగా ఉన్న మంత్రితో ఎలా సమన్వయం చేసుకుంటారోననే కొత్త ఆందోళన తెలుగుదేశం వర్గాల్లో మొదలైంది. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేందుకు ఏపీ సర్కార్ జిల్లాలకు ఇన్ ఛార్జీ మంత్రులను నియమించింది. […]

జిల్లాకో ఇన్‌ఛార్జి మంత్రి... టీడీపీలో ఆందోళన..
X
జిల్లాల్లో అభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణకు ఇన్‌ఛార్జి మంత్రుల వ్యవహారాన్ని చంద్రబాబు తెర‌పైకి తెచ్చారు. కింది స్థాయిలో కార్యకర్తల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని జిల్లాకో మంత్రిని ఇన్‌ఛార్జిగా నియ‌మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ ఇన్‌ఛార్జి మంత్రి స్థానికంగా ఉన్న మంత్రితో ఎలా సమన్వయం చేసుకుంటారోననే కొత్త ఆందోళన తెలుగుదేశం వర్గాల్లో మొదలైంది. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేందుకు ఏపీ సర్కార్ జిల్లాలకు ఇన్ ఛార్జీ మంత్రులను నియమించింది. ఇక నుంచి జిల్లాలోని అభివృద్ధి పనులు, సమస్యలు పరిష్కరించే బాధ్యత ఈ ఇన్‌ఛార్జీ మంత్రులపైనే ఉంటుందని టీడీపీ అధినేత చెబుతున్నారు. ఇంత‌కాలం జిల్లాల‌ వారిగా పార్టీ వ్యవహారాలు ప‌ర్యవేక్షణ కోసమే ఇన్‌ఛార్జి మంత్రులుండేవారు. అయితే ఇప్పుటి నుంచి మంత్రులకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఒక జిల్లా మంత్రిని మరో జిల్లాకు నియమించాలనేది సీఎం ఆలోచన. తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు ఈవిషయాలపై బాబు క్లారిటీ కూడా ఇచ్చారు. వెంటనే మొత్తం 13 జిల్లాల‌కు 13మంది మంత్రుల‌ను నియమించారు.
సంక్షేమ పథకాలు అమలు తీరును పర్యవేక్షణ..
ఈ ఇన్ ఛార్జీ మంత్రులంతా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, నీరు-చెట్టు కార్యక్రమం అమ‌లు, సాగునీటి ప్రాజెక్టుల పనుల తీరు, స్మార్ట్ గ్రామాలు, డ్వాక్రా రుణాల అమలు వంటి పనులను ప‌ర్యవేక్షిస్తారు. జిల్లాలో జరిగే జీఆర్‌సీ స‌మావేశంలో ఈ ఇన్ ఛార్జి మంత్రులు బాధ్యత వహిస్తారు. అయితే ఈ నియామ‌కాల్లో సీనియ‌ర్ల‌ను సైతం విస్మ‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కె.ఈ.కృష్ణ‌మూర్తి వంటి వారికి ఈ బాధ్య‌త‌ల్లో పాలుపంచుకునే అవ‌కాశం క‌ల‌గ‌లేదు. అయితే వయోపరిమితి దృష్య్టా ఆయ‌న్ని నియమించలేదని చెబుతున్నారు. ఆయ‌న కూడా ఈ విష‌య‌మై మాట్లాడుతూ త‌న‌ను నియ‌మించ‌క‌పోవ‌డం బాధ క‌లిగించ‌డం లేద‌ని, కొంత విశ్రాంతి తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని న‌ర్మ‌గర్భంగా ఆయ‌న అన‌డం చూస్తే ప‌రిస్థితి అర్ద‌మ‌వుతోంది..జూనియ‌ర్ మంత్రులయిన మృణాళిని, పీతల సుజాత, మాణిక్యాల‌రావు, కొల్లు ర‌వీంద్ర లాంటి మంత్రుల‌ను కూడా ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి పక్కనబెట్టారు. కాని అందుకు కారణం ఏంటన్నది తెలియలేదు. అయితే ఇక ఒక జిల్లా మంత్రి మరో జిల్లాలో పర్యవేక్షిస్తే ఆ జిల్లా మంత్రులతో ఎలా సమన్వయం చేసుకుంటారనే అభిప్రాయం తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఈ ఇన్‌ఛార్జి మంత్రుల నియామ‌కం కొత్త వివాదాల‌కు తెర తీస్తుందంటున్నారు.-పీఆర్‌
First Published:  17 May 2015 3:14 AM GMT
Next Story