నా ప్రాణాల‌కు ముప్పు ఉంది: న‌టి నీతు అగ‌ర్వాల్‌

ఎర్ర‌చంద‌నం కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈకేసులో నిందితుడిగా ఉన్న‌ మస్తాన్ వలీతో సినీ న‌టి నీతు అగ‌ర్వాల్‌ సహజీవనం చేసిన‌ విషయం తెలిసిందే. ఇదే కేసుతో సంబంధ‌ముంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు ఆమెను అరెస్టుచేయ‌గా ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. ఇప్పుడు మ‌స్తాన్ నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఆరోపించారు. త‌న క్రెడిట్ కార్డు మ‌స్తాన్‌కు ఇవ్వ‌డంతోనే తాను కేసులో ఇరుక్కున్నాన‌ని వాపోయారు. త‌న‌కు బెయిల్ రాకుండా కొంద‌రు అడ్డుకున్నార‌ని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌గానే ఈ ఘ‌ట‌న‌ల్లో ఎవ‌రెవ‌రి పాత్ర ఏంట‌నేది ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పారు.