కేన్స్… ఫ్యాష‌న్ పెరేడ్ కాదు….ష‌బానా ఆజ్మీ

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ అన‌గానే ఎవ‌రికైనా ముందుగా గుర్తొచ్చేది ఫ్యాష‌న్లు. ముఖ్యంగా తార‌లు రెడ్ కార్పెట్‌మీద ఏ ప్యాష‌న్లను ప్ర‌ద‌ర్శించారు అనేది కేన్స్ లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బాలివుడ్ సీనియ‌ర్ న‌టి ష‌బానా ఆజ్మి ఘాటుగా స్పందించారు. ట్విట్ట‌ర్లో స్పందించిన ష‌బానా, కేన్స్ ని ఫ్యాష‌న్ పెరేడ్‌గా చూడ‌వ‌ద్ద‌ని, సినిమాల‌కు ప్రాధాన‌త్య‌ను ఇవ్వాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఆమె 1976లో కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో పాల్గొన్న త‌మ చిత్రం నిశాంత్‌ని గుర్తు చేసుకున్నారు. న‌సీరుద్దీన్ షా, ష‌బానా, స్మితా పాటిల్ న‌టించిన శ్యామ్ బెన‌గ‌ల్ చిత్రం ఇది. స్మితాపాటిల్‌, తానూ కేన్స్ రెడ్ కార్పెట్ మీద కాంజీవ‌రం చీర‌ల్లో న‌డిచి ఆహుతుల్లో ఆస‌క్తిని క్రియేట్ చేశామ‌న్నారు. వారు త‌మ‌ని ఆస‌క్తిగా గ‌మ‌నించిన‌పుడు, మ‌మ్మ‌ల్నికాదు, మా చిత్రాన్ని చూడండి అని కోరామ‌ని ష‌బానా చెప్పారు. అలా త‌మ చిత్రాన్ని చాలామంది వీక్షించేలా చేయ‌గ‌లిగామ‌ని ఆమె గుర్తు చేశారు.