Telugu Global
Others

42 ఏళ్ల పాటు కోమాలో ఉన్న న‌ర్సు మృతి..

కింగ్‌ ఎడ్వర్ట్ మెమోరియల్‌ ఆసుపత్రిలో 42 ఏళ్లుగా కోమాలో ఉన్న 68 ఏళ్ల నర్స్‌ అరుణా షాన్‌బాగ్ కన్నుమూశారు. 1973లో కెమ్‌ హాస్పిటల్‌లో 26 ఏళ్ల క్రితం షాన్‌బాగ్ నర్స్‌గా పని చేసేవారు. ఆ సమయంలో అదే ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న‌ వార్డ్ బాయ్‌ సోహన్‌లాల్‌ వాల్మీకీ ఆమెపై క్రూరంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆమె మామూలు స్థితికి రాలేదు. లైంగిక దాడికి గురైన కూతురు […]

కింగ్‌ ఎడ్వర్ట్ మెమోరియల్‌ ఆసుపత్రిలో 42 ఏళ్లుగా కోమాలో ఉన్న 68 ఏళ్ల నర్స్‌ అరుణా షాన్‌బాగ్ కన్నుమూశారు. 1973లో కెమ్‌ హాస్పిటల్‌లో 26 ఏళ్ల క్రితం షాన్‌బాగ్ నర్స్‌గా పని చేసేవారు. ఆ సమయంలో అదే ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న‌ వార్డ్ బాయ్‌ సోహన్‌లాల్‌ వాల్మీకీ ఆమెపై క్రూరంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆమె మామూలు స్థితికి రాలేదు. లైంగిక దాడికి గురైన కూతురు కోమాలోకి వెళ్ళి పోవ‌డంతో తాము ఆమెను ఇంటికి తీసుకెళ్ళి వైద్యం చేయించ‌లేమ‌ని షాన్‌బాగ్‌ను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో హాస్పిటల్‌ పనిచేసే తోటి నర్సులు ఆమె బాధ్యతను తీసుకున్నారు. దాదాపు 42 యేళ్ళ నుంచి షాన్‌బాగ్ ఆల‌నాపాల‌నా వారే చూస్తున్నారు. గతవారం రోజులుగా తీవ్ర నిమోనియాతో బాధ పడుతూ వెంటి లేట‌ర్‌పై చికిత్స పొందుతున్న‌ షాన్‌బాగ్ సోమ‌వారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు.
First Published:  18 May 2015 2:52 AM GMT
Next Story