Telugu Global
Cinema & Entertainment

వస్తున్నాడు.. కండల వీరుడు

మొన్నటివరకు కోర్టు కేసులు, వివాదాలతోనే వార్తల్లోకెక్కిన సల్మాన్ ఖాన్, ఇకపై తన సినిమాలతో అలరించాలనుకుంటున్నాడు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చెప్పిన తేదీకి కొత్త సినిమాను థియేటర్లలోకి దింపాలనుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా తన కొత్త సినిమాకు సెంటిమెంట్ డేట్ ను కూడా ఫిక్స్ చేశాడు కండలవీరుడు. అవును.. అంతా ఊహించినట్టుగానే రంజాన్ కానుకగా సల్మాన్ కొత్త సినిమా బజరంగీ బైజాన్, థియేటర్లలో అలరించనుంది. ఇటీవల జరిగిన కోర్టు ట్రయిల్స్ కారణంగా సల్మాన్ కొత్త సినిమాపై అనుమానాలు పెరిగాయి. చెప్పిన […]

వస్తున్నాడు.. కండల వీరుడు
X
మొన్నటివరకు కోర్టు కేసులు, వివాదాలతోనే వార్తల్లోకెక్కిన సల్మాన్ ఖాన్, ఇకపై తన సినిమాలతో అలరించాలనుకుంటున్నాడు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చెప్పిన తేదీకి కొత్త సినిమాను థియేటర్లలోకి దింపాలనుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా తన కొత్త సినిమాకు సెంటిమెంట్ డేట్ ను కూడా ఫిక్స్ చేశాడు కండలవీరుడు. అవును.. అంతా ఊహించినట్టుగానే రంజాన్ కానుకగా సల్మాన్ కొత్త సినిమా బజరంగీ బైజాన్, థియేటర్లలో అలరించనుంది. ఇటీవల జరిగిన కోర్టు ట్రయిల్స్ కారణంగా సల్మాన్ కొత్త సినిమాపై అనుమానాలు పెరిగాయి. చెప్పిన టైమ్ కు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ బయ్యర్లలో కూడా ఉండేది. దీంతో స్వయంగా సల్మాన్ రంగంలోకి దిగాడు. తన కొత్త సినిమాపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని భరోసా ఇచ్చాడు. రంజాన్ కానుకగా భజరంగీ బైజాన్ రిలీజ్ అయితీరుందని ప్రకటించాడు. దీంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత ఏకథాటిగా మరిన్ని సినిమాలు షూట్ చేసి.. ఏడాదికి కనీసం రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు సల్మాన్.
First Published:  18 May 2015 12:02 AM GMT
Next Story