లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల బాటలో కొనసాగాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 27,687 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 8,373 పాయింట్ల వద్ద ముగిసింది. రెడ్డీస్ ల్యాబ్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, జైన్ ఇరిగేష‌న్‌, క్రాంప్ట‌న్‌ తదితర కంపెనీలు లాభాలు నమోదు చేశాయి. బ్యాంకింగ్ షేర్ల‌లో యూనియ‌న్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌, కెన‌రా బ్యాంక్‌, ఫెడ‌ర‌ల్ బ్యాంక్ న‌ష్టాల‌ను చ‌వి చూశాయి. అయినా బ్యాంక్ నిఫ్టి మాత్రం 240 పాయింట్లు పెరిగింది. డిఎల్ఎఫ్, ఎస్కార్ట్స్‌, టాటా మోటార్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. యెమెన్‌లో యుద్ధ వాతావరణం దృష్ట్యా ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.