Telugu Global
Others

భార్య ప్రతీకారం విలువ 51 లక్షలు..!

క‌ట్టుకున్న వాడు దూర‌మ‌యిపోతున్నాడు. త‌న‌కు ఇంక అత‌ను భ‌ర్త‌గా ఏ మాత్రం ఉండే అవ‌కాశం లేదు. కాని భ‌ర్త దూర‌మైనా త‌న‌ను మ‌రిచి పోకూడ‌ద‌నుకుందో భార్య. ఇందుకు త‌నేం చేసిందో తెలుసా… దుబాయ్‌కు చెందిన ఈ మహిళ భర్త రెండో పెళ్లి చేసుకోవటాన్ని తట్టుకోలేకపోయింది. భర్త ఆ పెళ్లి చేసుకుంటున్న సమయంలోనే.. తన తమ్ముడితో కలిసి త‌న‌ భర్తకు ఉన్న ట్రక్కు తీసుకుని రోడ్డెక్కింది. అక్క సూచనల మేరకు ఆ తమ్ముడు రోడ్లన్నీ కలియ దిరుగుతూ ట్రాఫిక్ […]

క‌ట్టుకున్న వాడు దూర‌మ‌యిపోతున్నాడు. త‌న‌కు ఇంక అత‌ను భ‌ర్త‌గా ఏ మాత్రం ఉండే అవ‌కాశం లేదు. కాని భ‌ర్త దూర‌మైనా త‌న‌ను మ‌రిచి పోకూడ‌ద‌నుకుందో భార్య. ఇందుకు త‌నేం చేసిందో తెలుసా… దుబాయ్‌కు చెందిన ఈ మహిళ భర్త రెండో పెళ్లి చేసుకోవటాన్ని తట్టుకోలేకపోయింది. భర్త ఆ పెళ్లి చేసుకుంటున్న సమయంలోనే.. తన తమ్ముడితో కలిసి త‌న‌ భర్తకు ఉన్న ట్రక్కు తీసుకుని రోడ్డెక్కింది. అక్క సూచనల మేరకు ఆ తమ్ముడు రోడ్లన్నీ కలియ దిరుగుతూ ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ… పదేపదే రెడ్‌ సిగ్నల్స్‌ను క్రాస్‌ చేశాడు. ఇదంతా ట్రాఫిక్‌ కెమెరాల్లో రికార్డయింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకుగాను అధికారులు దాదాపు రూ.51 లక్షల మేర చలాన్లు వేశారు. డ్రైవ‌ర్ ఎవ‌ర‌యినా ట్ర‌క్కు భ‌ర్త పేరుతోనే ఉండ‌డంతో చ‌లాన్ల‌న్నీ అత‌నికే వ‌చ్చాయి. దీంతో జ‌రిమానా క‌ట్ట‌లేక‌ ఆ భర్తకు గొంతు తడారిపోయింది. భ‌ర్త మీద ఏ మాత్రం జులుం చేయ‌కుండా త‌న క‌క్ష అలా తీర్చుకుందా భార్య.!
First Published:  17 May 2015 1:18 PM GMT
Next Story