న‌టిగా స‌త్తా చాటుతుందా..!

నౌ డౌట్  పూరీ జ‌గ‌న్నాధ్  చార్మీతో చేస్తున్న జ్యోతిల‌క్ష్మీ చిత్రం  ట్రైల‌ర్ చూస్తే ఈ చిత్రంలో చార్మీ న‌ట‌న‌కు  బాగా స్కోప్ ఉన్న‌ట్లు తెలుస్తుంది.  ద‌ర్శ‌కుడు పూరీ  ఆరు సంవ‌త్స‌రాల నుంచి చార్మితో ఈ చిత్రంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ విష‌యం తెల‌సిందే. టైటిల్ చూస్తుంటే వ్యాంప్ రో్ల్స్  ఫేమ‌స్ అయిన జ్యోతిల‌క్ష్మీ  జీవిత క‌థ ఆధారంగా చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాధ్ మాత్రం ఇది ప్ర‌ముఖ ర‌చ‌యిత  మ‌ల్లాది  వెంక‌టకృష్ణ మూర్తి  త‌న 19 వ యేట రాసిన మిసెస్ ప‌రాంకుశం అనే న‌వ‌ల ఆధారంగా రూపొందిస్తున్నాన‌ని చెబుతున్నారు. ఇక జ్యోతిల‌క్ష్మీ  ట్రైల‌ర్ చూస్తుంటే..  సినిమా లీడ్ రోల్ చుట్టూ బ‌ల‌మైన క‌థ ఉన్న‌ట్లు అర్ధం అవుతుంది. కెరీర్ ప‌రంగా  బౌన్స్ బ్యాక్ కావాల‌ని ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న చార్మీ డ్రీమ్‌ను  పూరీ జ‌గ‌న్నాధ్ డైరెక్ట్ చేసిన జ్యోతిల‌క్ష్మీ నిజం చేస్తుంద‌నే న‌మ్మ‌కం క‌లిగిస్తుంది. చార్మీ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు యాక్టింగ్ ప‌రంగా  ది బెస్ట్ అనిపించుకునే స్కోప్ ఉన్నట్లు తెలుస్తుంది. మ‌రి  ఈ ముద్దుగుమ్మ పైన‌ల్‌గా అభిమానుల అంచ‌నాల్ని ఏ మేర‌కు రీచ్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.