నేను చ‌చ్చిపోలేదు మొర్రో:  జాకీచాన్‌

గ‌త కొంత‌కాలంగా న‌కిలీ సోష‌ల్‌నెట్‌వ‌ర్కింగ్ సైట్లలో ఆక‌తాయిలు చేసే ప‌నులు సెల‌బ్రిటీల‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. నిన్న, మొన్న‌టి దాకా హీరోయిన్‌ల న‌గ్న దృశ్యాలు లీక్ చేసి వారిని కంగారుపెట్టిన పోకిరీలు తాజాగా హీరోల‌పైనా ప‌డ్డారు. ప్ర‌ముఖ‌ హాలీవుడ్ హీరో జాకీచాన్‌కూ ఈ బెడ‌ద త‌ప్ప‌లేదు. సోమ‌వారం ఆయ‌న మ‌ర‌ణించారంటూ సోష‌ల్‌నెట్‌వ‌ర్కింగ్‌సైట్లు, ఇంట‌ర్నెట్‌లో ఫొటోల‌తో స‌హా ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ విష‌యం పిల్లల నుంచి పెద్ద‌ల దాకా ఆయ‌న అభిమానుల‌ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ వార్త విన్న జాకీచాన్ కూడా అవాక్క‌య్యాడు. తాను చ‌నిపోలేదంటూ స్నేహితులు, సన్నిహితుల‌కు కాల్స్‌కు ఆన్స‌ర్ చేయ‌లేక‌పోయాడంట‌. లాభం లేద‌ని తాను చ‌నిపోలేద‌ని బ‌తికే ఉన్నాన‌ని, ఇలాంటి పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని త‌న ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లో త‌నే విజ్ఞ‌ప్తి చేయాల్సి వ‌చ్చింది. చైనా సోషల్ మీడియా వైబోలో తన పేరుతో ‘రెడ్ పాకెట్స్’ గురించి వెలువ‌డుతున్న స్కాం వార్త‌ల‌ను కూడా నమ్మ‌వ‌ద్దని  కోరాడు. త‌న‌కు ఒకే వైబో పేజీ ఉంద‌ని న‌కిలీ ఖాతాల‌ను న‌మ్మ‌కండ‌ని సూచించాడు.