Telugu Global
NEWS

వ‌ర్శిటీల్లో ఇళ్ళు క‌ట్టి తీర‌తా:  కేసీఆర్‌

విశ్వ‌విద్యాల‌యాల‌కు వేల ఎక‌రాలు అవ‌స‌రం లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. ప‌ని మొద‌లు పెట్టాక మ‌ధ్య‌లో ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇది మ‌హారాజుల కాలం కాద‌ని, ప్ర‌తీ యూనివ‌ర్శిటీకి వేలాది ఎకరాలు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. గోల్ఫ్ కోర్సుల‌కు, రేస్ కోర్సుల‌కు, పేకాట క్ల‌బ్బుల‌కు వంద‌లాది ఎక‌రాలు ఇచ్చార‌ని, కాని పేద‌లకు ఇళ్ళు క‌ట్టించ‌డానికి స్థలాలు ఉండ‌క్క‌ర్లేదా అని ప్ర‌శ్నించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో కొంత స్థ‌లం తీసుకుని […]

వ‌ర్శిటీల్లో ఇళ్ళు క‌ట్టి తీర‌తా:  కేసీఆర్‌
X
విశ్వ‌విద్యాల‌యాల‌కు వేల ఎక‌రాలు అవ‌స‌రం లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అన్నారు. ప‌ని మొద‌లు పెట్టాక మ‌ధ్య‌లో ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇది మ‌హారాజుల కాలం కాద‌ని, ప్ర‌తీ యూనివ‌ర్శిటీకి వేలాది ఎకరాలు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. గోల్ఫ్ కోర్సుల‌కు, రేస్ కోర్సుల‌కు, పేకాట క్ల‌బ్బుల‌కు వంద‌లాది ఎక‌రాలు ఇచ్చార‌ని, కాని పేద‌లకు ఇళ్ళు క‌ట్టించ‌డానికి స్థలాలు ఉండ‌క్క‌ర్లేదా అని ప్ర‌శ్నించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో కొంత స్థ‌లం తీసుకుని నిరుపేద‌ల‌కు, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఇళ్ళు క‌ట్టిస్తానంటే త‌న దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేస్తున్నార‌ని, త‌న‌కు బొంద పెడ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని, దేనికైనా తాను సిద్ధ‌మేన‌ని అన్నారు. ఒక ప‌ని మొద‌లు పెట్టిన త‌ర్వాత ఆపే ప్ర‌సక్తే లేద‌ని కేసీఆర్ తెలిపారు.
First Published:  19 May 2015 4:02 AM GMT
Next Story