Telugu Global
Others

విదేశాంగ విధానంలో మానవీయతకు ప్రాధాన్యం: మోడీ

సియోల్ : ‘భారతదేశ విదేశాంగ విధానానికి మానవీయ విలువలు, మానవ సంబంధాలే కొలమానాలు’ అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రెండు రోజుల పర్యటనకుగాను సోమవారం దక్షిణ కొరియా చేరుకున్న ప్రధాని సియోల్‌లోని కుయంగ్‌ హీ యూనివర్సిటీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారత విదేశాంగ విధానంలో మానవీయతకు పెద్దపీట వేస్తున్నామని, దీనివ‌ల్ల ఎన్నో క్లిష్టమైన సమస్యలను అవలీలగా అధిగమించగలిగామన్నారు. శ్రీలంకలో మరణశిక్ష పడిన భారత జాలర్లను రక్షించుకోవడంలో, యెమన్‌లో చిక్కుకుపోయిన 4 వేల మంది భారతీయులుసహా […]

విదేశాంగ విధానంలో మానవీయతకు ప్రాధాన్యం: మోడీ
X
సియోల్ : ‘భారతదేశ విదేశాంగ విధానానికి మానవీయ విలువలు, మానవ సంబంధాలే కొలమానాలు’ అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రెండు రోజుల పర్యటనకుగాను సోమవారం దక్షిణ కొరియా చేరుకున్న ప్రధాని సియోల్‌లోని కుయంగ్‌ హీ యూనివర్సిటీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారత విదేశాంగ విధానంలో మానవీయతకు పెద్దపీట వేస్తున్నామని, దీనివ‌ల్ల ఎన్నో క్లిష్టమైన సమస్యలను అవలీలగా అధిగమించగలిగామన్నారు. శ్రీలంకలో మరణశిక్ష పడిన భారత జాలర్లను రక్షించుకోవడంలో, యెమన్‌లో చిక్కుకుపోయిన 4 వేల మంది భారతీయులుసహా పలువురు విదేశీయులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో భారత దౌత్యవిధానం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. నేపాల్‌ భూకంప బాధితులను ఆదుకునే విషయంలోను, మాల్దీవులకు విమానాలు, ఓడలు ద్వారా తాగునీటిని పంపడంలోనూ మానవీయ దృక్పథంతోనే స్పందించామని మోడీ వివరించారు. ‘భారతదేశం విషయంలో ప్రపంచ దేశాల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ప్రపంచమంతా ఇప్పుడు మనల్నే చూస్తోంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు పరిస్థితులు బాగోలేవంటూ భారత్‌ను వీడి విదేశాలకు వెళ్లిన వారంతా నేడు స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటమే దీనికి కారణమన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను అత్యుత్తమ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది తన ప్రగాఢ ఆకాంక్షగా మోదీ పేర్కొన్నారు. అందుకే మేకిన్‌ ఇండియాకు రూపకల్పన చేశానని, ఈ కార్యక్రమాన్ని పరిపుష్టం చేసేందుకు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘స్వదేశానికి తిరిగి రండి. మీ అపార అనుభవాన్ని దేశాభివృద్ధికి వినియోగించండి’ అని మోడీ పిలుపునిచ్చారు. భారత్‌లో గత ప్రభుత్వాలు ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’ని అనుసరించాయి. ఇప్పటి వరకు చూసింది చాలు. కార్యరంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై భారత్‌ ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ని అనుసరిస్తుంది’ అంటూ యూపీఏ ప్రభుత్వపై చురకలు వేశారు.
First Published:  18 May 2015 8:59 PM GMT
Next Story