Telugu Global
National

మీడియా మాంత్రికుడు మోదీ: అమెరిక‌న్ మీడియా

విదేశీ ప‌ర్య‌ట‌న‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసిన ప్ర‌ధాని మోదీకి తీపి క‌బురు . ప్ర‌స్తుతం అమెరిక‌న్ మీడియా భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీని తెగ పొగుడుతోంది. ఆయ‌న మీడియా మాంత్రికుడ‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది. చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌లో అప్ డేట్ చేస్తున్న అతికొద్ది మంది ప్ర‌ముఖుల్లో మోదీ ఒక‌రని కొనియాడింది. బ‌రాక్ ఒబామా త‌రువాత ట్విట‌ర్ ఖాతాలో అత్య‌ధిక‌మంది ఫాలోవ‌ర్ల‌ను క‌లిగిన రాజ‌కీయ ప్ర‌ముఖుడిగా అవ‌త‌రించార‌ని అభివ‌ర్ణించింది. స‌మ‌ర్థంగా ప్ర‌చార మాధ్య‌మాల వినియోగం.. […]

మీడియా మాంత్రికుడు మోదీ: అమెరిక‌న్ మీడియా
X
విదేశీ ప‌ర్య‌ట‌న‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసిన ప్ర‌ధాని మోదీకి తీపి క‌బురు . ప్ర‌స్తుతం అమెరిక‌న్ మీడియా భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీని తెగ పొగుడుతోంది. ఆయ‌న మీడియా మాంత్రికుడ‌ని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది. చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌లో అప్ డేట్ చేస్తున్న అతికొద్ది మంది ప్ర‌ముఖుల్లో మోదీ ఒక‌రని కొనియాడింది. బ‌రాక్ ఒబామా త‌రువాత ట్విట‌ర్ ఖాతాలో అత్య‌ధిక‌మంది ఫాలోవ‌ర్ల‌ను క‌లిగిన రాజ‌కీయ ప్ర‌ముఖుడిగా అవ‌త‌రించార‌ని అభివ‌ర్ణించింది.
స‌మ‌ర్థంగా ప్ర‌చార మాధ్య‌మాల వినియోగం..
త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయటంలో ఆయ‌న‌ది అందెవేసిన చేయి అని పేర్కొంది. ఇంట‌ర్ నెట్‌, సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌తోపాటు, రేడియో, యూట్యూబ్ వంటి ప్ర‌చార మాధ్య‌మాల‌ను స‌మ‌ర్థంగా వినియోగించుకుంటున్నార‌ని వివ‌రించింది. మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మంతో మారుమూల ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సైతం ఆయ‌న త‌న సందేశాల‌ను చేర‌వేయ‌గ‌లుగుతున్నార‌ని కొనియాడింది. సోష‌ల్ నెట్‌వర్కింగ్ సైట్ల‌లో ఆయ‌న హ‌వా ఇలాగే కొన‌సాగితే.. అమెరిక‌న్ సెక్స్ అణుబాంబు కిమ్ కిర్దాషియాన్ ( 1.42 కోట్ల‌మంది ఫాలోవ‌ర్ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్విట‌ర్ వినియోగంలో 65 స్థానంలో ఉంది)ను త్వ‌ర‌లోనే అధిగ‌మించ‌నున్నారు. ప్ర‌స్తతం మోదీ 1.28 కోట్ల మంది ట్విట‌ర్ ఫాలోవ‌ర్ల‌తో 85 వ స్థానంలో ఉన్నారు. కాగా బ‌రాక్ ఒబామాకు 5.9 కోట్ల‌ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంత‌మంది ఫాలోవ‌ర్లు క‌లిగిన తొలి భార‌త రాజ‌కీయ నాయ‌కుడు మోదీ కావ‌డం విశేషం.
నాడు నింద‌లు.. నేడు పొగ‌డ్త‌లు..!
ఒక‌ప్పుడు 2002 గుజ‌రాత్ అల్ల‌ర్ల‌తో సంబంధ‌ముంద‌న్న వ్య‌క్తిగా ఆయ‌న్ను గుర్తించ‌డానికి అమెరికా ఇష్ట‌ప‌డ‌లేదు. క‌నీసం వీసా జారీ చేసేందుకు సైతం స‌సేమీరా అంది. ఆయ‌న వ‌స్తే శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం అని వ్యాఖ్యానించింది. మీడియా కూడా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానే వార్త‌లు రాసేది. కానీ, మోదీ ప్ర‌ధాని కాగానే స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోయాయి. అధ్య‌క్షుడు బ‌రాక్ ఆహ్వానంతో అమెరికాలో అడుగుపెట్టారు, వైట్‌హౌస్‌లో ఆతిథ్యం స్వీక‌రించారు. రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరుగాంచిన మోదీ అంద‌రినీ క‌లుపుకొని పోవడంలో దిట్ట. పొగొట్టుకున్న చోట రాబ‌ట్టుకోవ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇప్పుడు అదే విష‌యాన్ని అమెరికా మీడియాతో చెప్పించి తానేంటో మ‌రోసారి నిరూపించుకున్నారు.
First Published:  18 May 2015 11:52 PM GMT
Next Story