Telugu Global
Cinema & Entertainment

రాజమౌళికి ప్రభాస్ ఝలక్

రాజమౌళి, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ప్రభాస్ కు స్టార్ డమ్ ఇచ్చింది రాజమౌళే. ఛత్రపతి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ను మాస్ హీరోగా మార్చేశాడు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి బాహుబలి సినిమా చేస్తున్నారు. కేవలం రాజమౌళిపై నమ్మకంతో, స్నేహభావంతో కాల్షీట్లతో సంబంధంలేకుండా సినిమా కోసం పనిచేస్తున్నాడు ప్రభాస్. ఇంత మంచి రిలేషన్ షిప్ ఉంది ఇద్దరి మధ్య. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం రాజమౌళిని షాక్ […]

రాజమౌళికి ప్రభాస్ ఝలక్
X
రాజమౌళి, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ప్రభాస్ కు స్టార్ డమ్ ఇచ్చింది రాజమౌళే. ఛత్రపతి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ను మాస్ హీరోగా మార్చేశాడు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి బాహుబలి సినిమా చేస్తున్నారు. కేవలం రాజమౌళిపై నమ్మకంతో, స్నేహభావంతో కాల్షీట్లతో సంబంధంలేకుండా సినిమా కోసం పనిచేస్తున్నాడు ప్రభాస్. ఇంత మంచి రిలేషన్ షిప్ ఉంది ఇద్దరి మధ్య. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం రాజమౌళిని షాక్ కు గురిచేసింది. ఓ టెలివిజన్ షోకు ప్రభాస్, రాజమౌళి గెస్టులుగా హాజరయ్యారు. ఇందులో ఓ ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి తీసిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమా అంటే తనకు అస్సలు నచ్చదని నిర్మోహమాటంగా చెప్పేశాడు ప్రభాస్. దీంతో అంతా అవాక్కయ్యారు. రాజమౌళికి అయితే ఏం మాట్లాడాలో కూడా అర్థంకాలేదు. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నంబర్-1 సినిమాలో ఇంటర్వెల్ పార్ట్ తప్ప తనకు ఏదీ నచ్చలేదని కుండబద్దలుకొట్టాడు ప్రభాస్. తను ఏం మాట్లాడినా రాజమౌళి అర్థంచేసుకోగలడు కాబట్టే ప్రభాస్ అంత నిర్మోహమాటంగా మాట్లాడగలిగాడు.
First Published:  18 May 2015 7:58 PM GMT
Next Story