Telugu Global
Cinema & Entertainment

మహేష్ కోసం కొట్టుకుంటున్న సమంత-రకుల్

మహేష్ తన వాడు అంటోంది సమంత. ఇప్పటికే రెండు సినిమాలు చేసింది కాబట్టి.. మూడో సినిమా కూడా తనకే కావాలని పట్టుబడుతోంది. అటు రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ససేమిరా అంటోంది. ప్రిన్స్ తనకే కావాలని మారాం చేస్తోంది. మహేష్ కోసం వీళ్లిద్దరూ ఇలా కొట్టుకోవడానికి కారణం బ్రహ్మోత్సవం సినిమా. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది బ్రహ్మోత్సవం సినిమా. ఈ సినిమాలో మహేష్ సరసన ఛాన్స్ కోసం రకుల్, సమంత ఇలా […]

మహేష్ కోసం కొట్టుకుంటున్న సమంత-రకుల్
X
మహేష్ తన వాడు అంటోంది సమంత. ఇప్పటికే రెండు సినిమాలు చేసింది కాబట్టి.. మూడో సినిమా కూడా తనకే కావాలని పట్టుబడుతోంది. అటు రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ససేమిరా అంటోంది. ప్రిన్స్ తనకే కావాలని మారాం చేస్తోంది. మహేష్ కోసం వీళ్లిద్దరూ ఇలా కొట్టుకోవడానికి కారణం బ్రహ్మోత్సవం సినిమా. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది బ్రహ్మోత్సవం సినిమా. ఈ సినిమాలో మహేష్ సరసన ఛాన్స్ కోసం రకుల్, సమంత ఇలా పోటీపడుతున్నారు. నిజానికి శ్రీకాంత్ అడ్డాల వీళ్లిద్దరికీ కథ చెప్పాడు. సమంతతో ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఆమెకి కథ చెప్పాడు. ఇక రకుల్ ను కూడా పరిశీలిస్తే బాగుంటుందని నిర్మాత సూచించడంతో ఆమెకి కూడా కథ వినిపించాడు. మహేష్ మూవీ కావడంతో ఇద్దరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నిర్ణయం మహేష్ చేతుల్లోనే. సమంతతో మూడోసారి కలిసి నటిస్తాడా.. లేక రకుల్ ప్రీత్ సింగ్ తో వెండితెరపై ఫ్రెష్ కాంబినేషన్ కు తెరతీస్తాడా అనేది ఇప్పుడు మహేష్ చేతుల్లోనే..
First Published:  18 May 2015 7:40 PM GMT
Next Story