Telugu Global
Others

ప్ర‌త్యేక హోదా... గుత్తా లేఖ‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేస్తుండ‌గా… అలాంటి ప‌ని చేయొద్దంటూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి మోడిని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోర‌గా… అదే పార్టీకి చెందిన ఎంపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్దంటూ లేఖ రాయడం ఆ పార్టీ నాయ‌కుల‌కే ఆగ్ర‌హం తెప్పించింది. అస‌లు కేంద్ర నాయ‌క‌త్వం ఓ విధానంతో […]

ప్ర‌త్యేక హోదా... గుత్తా లేఖ‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేస్తుండ‌గా… అలాంటి ప‌ని చేయొద్దంటూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి మోడిని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోర‌గా… అదే పార్టీకి చెందిన ఎంపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్దంటూ లేఖ రాయడం ఆ పార్టీ నాయ‌కుల‌కే ఆగ్ర‌హం తెప్పించింది. అస‌లు కేంద్ర నాయ‌క‌త్వం ఓ విధానంతో ముందుకు వెళుతున్న‌ప్పుడు దానికి భిన్న‌మైన వైఖ‌రితో గుత్తా లేఖ రాయ‌డం సోనియాగాంధీకి ఆగ్ర‌హం తెప్పించింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న‌ డిమాండ్‌తో కొంతకాలంగా నిరసన జ్వాలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో దాదాపు అన్ని పార్టీలు ఒకే నినాదంతో ముందుకెళ్తున్నాయి. పార్టీలే కాదు… సామాన్య ప్రజలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విభజనతో ప్రజలకు దూరమైన కాంగ్రెస్.. మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాగా తీసుకుంది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ రాష్ట్ర పీసీసీ నాయకత్వం గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. గతంలో ప్రత్యేక హోదా కోరుతూ కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. సోనియాగాంధీ కూడా లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్ళి హోదాను వెంట‌నే ఇవ్వాల‌ని కోరారు.
కాంగ్రెస్ నాయ‌కుల్లోనే భిన్నాభిప్రాయాలు
అయితే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీలోనే నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తెలంగాణ కాంగ్రెస్ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని, ఇక్క‌డ ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఆ రాష్ట్రానికి త‌ర‌లిపోతాయ‌ని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఈ నెల 12న కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ సారాంశం. తెలంగాణ కంటే ఏపీ అక్షరాస్యత, పరిశ్రమలు, ఉపాధి పరంగా ముందుందన్నారు. ఆ రాష్ర్టానికి సముద్ర తీరంతోపాటు విశాఖ స్టిల్‌ప్లాంట్‌, నాలుగు ఎయిర్‌పోర్టులు ఉన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలన్నీ ఆ రాష్ర్టానికి తరలివెళ్లే అవకాశం ఉందని.. అదే జరిగితే ఇక్కడ నిరుద్యోగ సమస్య మ‌రింత పెరిగిపోతుంద‌ని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. తెలంగాణ‌లో హైద‌రాబాద్ త‌ప్ప మ‌రేమీ లేద‌ని, ఈ రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల్లో అభివృద్ధి ఎంతో జ‌ర‌గాల్సి ఉంద‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే తెలంగాణ‌లో అభివృద్ధి కుంటుప‌డుతుంద‌ని ఆయ‌న ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అందుచేత ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్దని గుత్తా కేంద్రానికి లేఖ రాయడంపై ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
అది ఆయ‌న వ్య‌క్తిగ‌తం: జైరాం ర‌మేష్‌
ప్ర‌త్యేక హోదా విష‌య‌మై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేష్ మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌వ‌ద్దంటూ గుత్తా లేఖ రాసిన మాట వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రిస్తూ అది ఆయ‌న వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మ‌ని కొట్టి ప‌డేశారు. తాము ఇప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. త‌మ పార్టీ అధినేత్రి కూడా ప్ర‌త్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అలాంట‌ప్పుడు గుత్తా లేఖ ఎలా రాశార‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణంటే కాంగ్రెస్‌లో ఏ మాత్రం భ‌యం లేద‌న్న సంగ‌తి ఈ అంశం చెప్ప‌క‌నే చెబుతోంది. నిజానికి ఏ పార్టీకైనా ఒక అంశంపై ఒక సిద్ధాంతం.. ఒక క్లారీటి ఉంటుంది. దానికనుగుణంగానే నాయకులు నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. అంతేగానీ, ఒకే పార్టీలోని నాయకులు ఒక అంశంపై వివిధ రకాలుగా మాట్లాడడం ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్యాష‌నైపోయింది. వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను పార్టీ విధానంగా చెప్ప‌డం… దాన్ని మిగిలిన నాయ‌కుల అభిప్రాయాల‌తో రుద్ద‌డం కాంగ్రెస్ నాయ‌కుల‌కు మ‌రీ అల‌వాట‌యిపోయింది. నిజానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీయే స్వ‌యంగా ప్ర‌ధాని మోడికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని విన్న‌వించిన త‌ర్వాత కూడా గుత్తా లాంటి సీనియ‌ర్ నాయ‌కులు ఇలా లేఖ‌లు రాయ‌డం, బ‌హిరంగంగా అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం… కాంగ్రెస్ సంస్కృతికి అద్దం ప‌డుతోంది. మొత్తంగా విభజన ముందు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ డ్రామా ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.-పీఆర్‌
First Published:  20 May 2015 5:01 AM GMT
Next Story