Telugu Global
Family

సత్యం (Devotional)

సత్యం అంటే ఏమిటి? సాధారణంగా సత్యం చెప్పు అంటూ ఉంటారు. అంటే అబద్ధానికి వ్యతిరేకమయింది సత్యమంటారు. నిజం అంటూ ఉంటారు. నిజమంటే సత్యమా? ఇది ప్రపపంచానికి సంబంధించినంత మేరకు సరయిందే, కాని ఈ రకమయిన సత్యం పరిమితమయింది. పరిధులు కలిగింది. అనంత సత్యానికి దానికి ఎట్లాంటి సంబంధం లేదు. గురువు శిష్యులతోపాటు కూర్చుని గొప్ప అధ్యాత్మిక విషయాల చర్చలో ఉన్నాడు. చర్చ మెల్లగా సత్యం వేపు మళ్ళింది. ఈ చర్చ ద్వారా సత్యమంటే ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలని […]

సత్యం అంటే ఏమిటి? సాధారణంగా సత్యం చెప్పు అంటూ ఉంటారు. అంటే అబద్ధానికి వ్యతిరేకమయింది సత్యమంటారు. నిజం అంటూ ఉంటారు. నిజమంటే సత్యమా? ఇది ప్రపపంచానికి సంబంధించినంత మేరకు సరయిందే, కాని ఈ రకమయిన సత్యం పరిమితమయింది. పరిధులు కలిగింది. అనంత సత్యానికి దానికి ఎట్లాంటి సంబంధం లేదు.
గురువు శిష్యులతోపాటు కూర్చుని గొప్ప అధ్యాత్మిక విషయాల చర్చలో ఉన్నాడు. చర్చ మెల్లగా సత్యం వేపు మళ్ళింది. ఈ చర్చ ద్వారా సత్యమంటే ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలని శిష్యులు ధృఢ సంకల్పంతో ఉన్నారు. ఒక శిష్యుడు గురువు గారితో “సత్యమంటే ఏమిటి?” అని అడిగాడు.
గురువు “సత్యమన్నది ఒక కాగాడా లాంటిది. దాన్ని ధరించిన వ్యక్తిని కాగడా చివర వెలిగే కాంతి తనది కాదని తెలుసు. కానీ కాగడాతో వెళ్ళి తన ఇంకో కాగడాని వెలిగిస్తానని అతనికి తెలుసు” అన్నాడు.
శిష్యుడు “చీకట్లో వున్న దీపాన్ని వెలిగించడానికి కాగడాని తీసుకుపోవచ్చు. ఇతర కాగడాల్ని వెలిగించవచ్చు. అది అర్థవంతమయిన పని. కానీ ఎడారిలో కాగడాతో ఏం చెయ్యగలం?” అన్నాడు.
“వ్యక్తి ఎడారిలో కూడా కాగడా పట్టుకుని నడవాలి. ఎడారిలో కూడా రాత్రి వస్తుంది కదా! అప్పుడు అక్కడ చీకటిని దగ్గరకు రానివ్వకుండా చెయ్యవచ్చు” అన్నాడు గురువు.
“మరి సముద్రంలో కాగడా సంగతేమిటి?” అన్నాడు శిష్యుడు.
గురువు “సముద్రంలోనయినా కాగడాతో సాగాలి. అది ఆరిపోని కాగడా.
ధగధగ మంటలు మండే కాగడా. ఆది ఆరని కాగడా! దాన్ని నీళ్ళు ఆర్ప లేవు” అన్నాడు మార్మికంగా.
శిష్యుడికి గురువు చెప్పదలచుకున్నది అర్థమయింది.
కానీ శిష్యుడు కాసేపు మౌనంగా ఉండి “గురువు గారూ! నాకు కాగడా కనిపించడం లేదు” అన్నాడు
గురువు “కాగడా నీ దగ్గర లేదు కదా! అన్నాడు
“మరయితే కాగడా నా చేతికి ఎలా అందుతుంది?” ప్రశ్నించాడు శిష్యుడు
శిష్యుడి ధర్మ సందేహాన్ని గురువు ప‌సి కట్టాడు.
“అవును. నిజమే. మొదట కాంతి నిండిన కాగడా నీ చేతికి అందాలంటే నీలోని పాపాన్ని నువ్వు తిరస్కరించాలి. నీలోని అంధకారాన్ని వదిలించుకోవాలి. నీలోని నువ్వు అన్వేషించాలి. నిన్ను నువ్వు పరిశుభ్ర పరచుకోవాలి. నిన్ను నువ్వు స్వచ్ఛ పరచుకోవాలి. అప్పుడు నీ చేతికి కాగడా అందుతుంది. అప్పుడు కాంతి జ్వలిస్తుంది. కాదు నువ్వే కాంతిగా మారిపోతావు” అన్నాడు.
సత్యమంటే ఏమిటో శిష్యుడికి అవగాహన అయింది.
-సౌభాగ్య

First Published:  19 May 2015 1:01 PM GMT
Next Story