Telugu Global
Cinema & Entertainment

నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్

తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇన్నాళ్లూ కెమెరా కంటికి కనిపించకుండా పెంచిన తన కొడుకు ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తనయుడితో దిగిన 2 ఫొటోల్ని అభిమానుల కోసం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఉంచాడు. ఈ రెండు ఫొటోల కోసం దాదాపు గంటన్నర పాటు ఫొటోషూట్ చేసినట్టు సమాచారం. తనయుడు అభయ్ రామ్ ఫొటోలతో పాటు మరికొద్దిసేపట్లో తన […]

నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్
X
తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇన్నాళ్లూ కెమెరా కంటికి కనిపించకుండా పెంచిన తన కొడుకు ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తనయుడితో దిగిన 2 ఫొటోల్ని అభిమానుల కోసం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఉంచాడు. ఈ రెండు ఫొటోల కోసం దాదాపు గంటన్నర పాటు ఫొటోషూట్ చేసినట్టు సమాచారం. తనయుడు అభయ్ రామ్ ఫొటోలతో పాటు మరికొద్దిసేపట్లో తన కొత్త సినిమా సంగతుల్ని కూడా వెల్లడించబోతున్నాడు యంగ్ టైగర్.
అల్లు అర్జున్ ఇప్పటికే తన కొడుకును మీడియాకు, ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు. ఎప్పటికప్పుడు అబ్బాయ్ ఫొటోల్ని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. అటు మహేష్ కూడా అంతే. సమయం కుదిరినప్పుడల్లా కొడుకు ఫొటోల్నిఅభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇన్ని రోజులైనా ఇప్పటివరకు అభయ్ రామ్ ను ఎవరికీ చూపించలేదు. ఎందుకో ఇప్పుడు చూపించాలనిపించింది. అందుకే ఇలా అబ్బాయ్ తో కలిసి ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యాడు.
First Published:  19 May 2015 11:31 PM GMT
Next Story