Telugu Global
Cinema & Entertainment

ప్ర‌భాస్ హీరోయిన్ ఫిదా అయ్యింది..!

బాలీవుడ్  లో   బోల్డ్ లేడి అంటే కంగ‌నా పేరు మాత్రమే వినిపిస్తుంది. తెలుగులో  ఏక్ నిరంజ‌న్ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన  ఈ ముద్దుగుమ్మ‌..  ఆ త‌ర‌వాత తెలుగు అభిమానుల‌కు ట‌చ్ లో లేదు.  అయితే  బాలీవుడ్ లో మాత్రం రెగ్యుల‌ర్ గా చిత్రాలు  చేస్తూనే వుంది.  ఈ మ‌ధ్య నే క్వీన్ సినిమాకు   నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌రెస్ గా  అవార్డు పొందింది.      ఇక న‌టిగా త‌న కు ఎంతో పేరు తెచ్చిన  త‌ను […]

ప్ర‌భాస్ హీరోయిన్ ఫిదా అయ్యింది..!
X

బాలీవుడ్ లో బోల్డ్ లేడి అంటే కంగ‌నా పేరు మాత్రమే వినిపిస్తుంది. తెలుగులో ఏక్ నిరంజ‌న్ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర‌వాత తెలుగు అభిమానుల‌కు ట‌చ్ లో లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం రెగ్యుల‌ర్ గా చిత్రాలు చేస్తూనే వుంది. ఈ మ‌ధ్య నే క్వీన్ సినిమాకు నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌రెస్ గా అవార్డు పొందింది.
ఇక న‌టిగా త‌న కు ఎంతో పేరు తెచ్చిన త‌ను వెడ్స్ మ‌ను చిత్రం గురించి ప‌లు విశేషాలు చెప్పింది. ఈ సినిమా కు సీక్వెల్ లో న‌టించ‌డం త‌న‌కు ఎంతో సంతోషం క‌లిగిస్తున్న‌ట్లు చెప్పింది. ఈ సినిమా షూటింగ్ కోసం ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఒక ఫామ్ హౌస్ లో షూట్ జ‌రిగిందిట‌. అక్క‌డ షూటింగ్ అయిన త‌రువాత స్ట్రీట్ ఫుడ్ తినే వార‌ట‌. గ‌తంలో త‌ను ఎప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినేది కాద‌ట‌. ఈ సినిమా పుణ్యమా అని అవి కూడా అలవాటైపోయాయి. కాన్పూర్‌లో ‘తుండే కబాబ్స్’ బాగా ఫేమస్. నేను శాకాహారిని కాబట్టి అవేమీ తినడానికి లేదు. అందుకని చాట్ తిన్నా. అప్పట్నుంచీ స్ట్రీట్ ఫుడ్‌కు బానిసైపోయా. సాయంత్రం అయ్యేసరికి మేం వెళ్లడమో లేక చాట్ పార్శిల్ తెప్పించుకుని తినడమో జరిగేది. లక్నోలోని ‘శుక్లా చాట్ హౌస్’ చాట్‌కు ఫిదా అయిపోయా’ నంటూ చెప్పుకొచ్చింది. మాధ‌వ‌న్ , కంగ‌నా లీడ్ రోల్స్ లో త‌ను వెడ్స్ మ‌ను సినిమా సీక్వెల్ ను ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్ రాయ్ చేస్తున్నారు.

First Published:  20 May 2015 12:47 AM GMT
Next Story