Telugu Global
Cinema & Entertainment

రూమర్ల రాణి.. నయనతార

ఎండాకాలం చెమట.. వానాకాలం బురద ఎంత కామనో.. హీరోయిన్లతో పాటు రూమర్లు కూడా అంతే కామన్. ప్రతి హీరోయిన్ పై రోజూ ఏదో ఒక పుకారు పుట్టుకొస్తుంది. అయితే ఈ విషయంలో నయనతార పీహెచ్ డీ పూర్తిచేసింది. సౌత్ లో ఆమెపై వచ్చినన్ని పుకార్లు మరే హీరోయిన్ పై రాలేదంటే అందులో ఆశ్ఛర్యపడాల్సిందేం లేదు. ఇప్పటికే పలువురు దర్శకులు, హీరోలతో ఎఫైర్ అంటూ వార్తల్లోకెక్కి.. వాటిని ఖండించిన నయనతార ఇప్పుడు మరో పుకారుతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.  […]

రూమర్ల రాణి.. నయనతార
X
ఎండాకాలం చెమట.. వానాకాలం బురద ఎంత కామనో.. హీరోయిన్లతో పాటు రూమర్లు కూడా అంతే కామన్. ప్రతి హీరోయిన్ పై రోజూ ఏదో ఒక పుకారు పుట్టుకొస్తుంది. అయితే ఈ విషయంలో నయనతార పీహెచ్ డీ పూర్తిచేసింది. సౌత్ లో ఆమెపై వచ్చినన్ని పుకార్లు మరే హీరోయిన్ పై రాలేదంటే అందులో ఆశ్ఛర్యపడాల్సిందేం లేదు. ఇప్పటికే పలువురు దర్శకులు, హీరోలతో ఎఫైర్ అంటూ వార్తల్లోకెక్కి.. వాటిని ఖండించిన నయనతార ఇప్పుడు మరో పుకారుతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి గోప్యంగా జరిగిపోయిందనే ప్రచారం తమిళనాట ఊపందుకుంది. ఈ వార్త అలాఅలా పాకి మొత్తం సౌత్ అంతా వ్యాపించింది. తెలుగు మీడియాలో కూడా తెగ వార్తలొచ్చాయి. దీంతో నయనతార మరోసారి రెస్పాండ్ అయింది. తనకు విగ్నేష్ కు పెళ్లికాలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది నయన్. గతంలో కూడా ఇలానే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందంటూ.. నయన్-ఉదయనిధి స్టాలిన్, నయన్-ఆర్యలపై పుకార్లు వచ్చాయి.
First Published:  20 May 2015 12:11 AM GMT
Next Story