త‌మ‌న్నా అంత అందంగా అనిపించ‌డం లేదే..! 

బాహుబ‌లి  సినిమాకు సంబంధించి   ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విడుద‌ల చేస్తున్న ఫ‌స్ట్ లుక్ లో భాగంగా  రిలీజ్ చేసిన త‌మ‌న్నా లుక్  పెద్ద‌గా  అల‌రించ‌డంలేదు.    సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ఆల్ట‌ర్ నేటివ్ డే లో   రాజ‌మౌళి  ప్ర‌ధాన పాత్ర దారుల‌కు సంబంధించిన  ఫ‌స్ట్ లుక్ ను  రిలీజ్ చేస్తూ  అభిమానుల్లో అంచ‌నాలు మ‌రింతగా పెంచుతున్నారు.   అయితే  నిన్న రిలీజ్ చేసిన త‌మ‌న్నా అవంతిక లుక్  స‌గ‌టుగానే ఉంది. `ఆమే అందం ఒక రహాస్యం` అంటూ  డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఒక  వ్యాఖ్యానం కూడా రాశారు.  అయితే   రాసినంత అందం ఆమేలో క‌నిపించ‌డం లేద‌నే టాక్ కొంద‌రి అభిమానుల్లో వినిపిస్తుంది.  అయితే కేవ‌లం ఒక పిక్చ‌ర్ లో క‌నిపించే లుక్ ను  ఆధారం చేసుకుని  టోట‌ల్  అవంతిక  రోల్ ను  వ్యాఖ్యానించ‌డం  స‌రికాదు అంటున్నారు క్రిటిక్స్.