ఈ సంస్థల్లో డిపాజిట్లు పెట్టొద్దు: ప్రజలకు సీఐడీ హెచ్చరిక

ఆర్‌బీఐ లైసెన్సులు రద్దు చేసిన 31 నాన్‌-బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలతో లావాదేవీలు నిర్వహించ వ‌ద్ద‌ని  తెలంగాణ సీఐడీ ప్రజలను అప్రమత్తం చేసింది. ఆ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ లీజింగ్‌ కంపెనీ, మార్గదర్శి ఫైనాన్స్‌ సెషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా ఉన్నాయి. మొత్తం జాబితాలో రెండు మినహా మిగిలినవన్నీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలోనే రిజిస్టర్‌ అయ్యాయి. ‘‘ఈ జాబితాలోని సంస్థలతో పెట్టుబడులు పెట్టొద్దు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు’’ అని సీఐడీ సూచించింది.
ఇవీ ఆ కంపెనీలు…
1. మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ లీజింగ్‌ కంపెనీ, 2. మార్గదర్శి ఫైనాన్స్‌ సెషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 3. యుక్తా ఫైనాన్స్‌ లిమిటెడ్‌, 4. ఎమర్జీ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌, 5. శ్రీ హైర్‌ పర్చేజ్‌, 6. సిరి ఆటో ఫైనాన్షియర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ (ఖమ్మం), 7. విష్ణు ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 8. హెచ్‌సీజీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇంపెక్స్‌ లిమిటెడ్‌, 9. అవ్యయా ఫైనాన్స్‌ లిమిటెడ్‌, 10. శ్రీ హైర్‌ పర్చేజ్‌ అండ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, 11. డీఎస్‌ఎల్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 12. బీఎన్‌ఆర్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌, 13. నానో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, 14. బాంబినో ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 15. జీఎన్‌ వాసవి ఫైనాన్స్‌ లిమిటెడ్‌, 16. శుభం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, 17. చెన్నై ఫైనాన్సియో లిమిటెడ్‌, 18. ఆర్‌ఆర్‌ ఫైనాన్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, 19. శ్రీ మహాలక్ష్మీ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, 20. మారుతీ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, 21. ప్రొద్దుటూర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌, 22. మ్యాగ్నిల్‌ ఫైనాన్స్‌ అండ్‌ హైర్‌ పర్చేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 23. భవ్యా క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, 24. సూర్యలక్ష్మీ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, 25. సీగల్‌ లీఫిన్‌ లిమిటెడ్‌, 26. శ్రీమాన్‌ సాయి సెక్యూరిటీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, (కరీంనగర్‌), 27. జీఎన్‌ వాసవీ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, 28. విక్రాంత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ఇంపెక్స్‌ లిమిటెడ్‌, 29. సెహగల్‌ లీజింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ 30. సైక్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 31. నరేన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్.
అయితే ఈ సంస్థ‌ల్లో మార్గ‌ద‌ర్శి వివ‌ర‌ణ ఇచ్చింది. కంపెనీలను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి దాకా ఏనాడూ తాము ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించలేదని పేర్కొంది. తాము పదేళ్ల కిందటే బ్యాంకింగ్‌ ఫైనాన్సింగ్‌ విధానం కలిగిన వ్యాపార లావాదేవీలన్నింటినీ నిలిపి వేశామని ఒక ప్రకటనలో తెలిపింది.