Telugu Global
Others

లాడెన్ ను ప‌ట్టించింది ఇత‌డేనా?

అగ్ర‌రాజ్యం అమెరికాను గ‌డ‌గ‌డ‌లాడించిన తీవ్ర‌వాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను ఆచూకీ గుట్టు ఎవ‌రు విప్పారు? ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న‌చ‌ర్చ ఇదే.  2011, మే2న పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో అమెరికా సేన‌లు ర‌హ‌స్య ఆప‌రేష‌న్ ద్వారా లాడెన్ ను మ‌ట్టు బెట్టిన విష‌యం విదిత‌మే. అయితే పాక్ స‌హ‌కారం లేకుండా అమెరికాకు లాడెన్ ఆచూకీ ఎలా తెలిసింది? ఇంత‌కాలం ఇది ఓ మిస్ట‌రీగానే మిగిలిపోయింది. ఓ మాజీ ఐఎస్ ఐ అధికారి రూ.160 కోట్ల‌కు బిన్‌లాడెన్ […]

లాడెన్ ను ప‌ట్టించింది ఇత‌డేనా?
X
అగ్ర‌రాజ్యం అమెరికాను గ‌డ‌గ‌డ‌లాడించిన తీవ్ర‌వాది, అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను ఆచూకీ గుట్టు ఎవ‌రు విప్పారు? ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న‌చ‌ర్చ ఇదే. 2011, మే2న పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో అమెరికా సేన‌లు ర‌హ‌స్య ఆప‌రేష‌న్ ద్వారా లాడెన్ ను మ‌ట్టు బెట్టిన విష‌యం విదిత‌మే. అయితే పాక్ స‌హ‌కారం లేకుండా అమెరికాకు లాడెన్ ఆచూకీ ఎలా తెలిసింది? ఇంత‌కాలం ఇది ఓ మిస్ట‌రీగానే మిగిలిపోయింది. ఓ మాజీ ఐఎస్ ఐ అధికారి రూ.160 కోట్ల‌కు బిన్‌లాడెన్ ఉంటున్న సమాచారాన్ని చెప్పార‌ని ప్ర‌ముఖ విలేక‌రి సీమ‌ర్ హార్ష్ ఇటీవ‌ల వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ అధికారి పేరు ఉస్మాన్ ఖ‌లీద్‌ అని, 1979లోనే అత‌ను పాకిస్తాన్ నుంచి లండ‌న్‌కు వెళ్లిపోయాడ‌ని పాకిస్తాన్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల్లో వాస్త‌వ‌మెంత ఉందో తెలియ‌దుకానీ, ఉస్మాద్ ఖ‌లీద్ పేరు ఇప్పుడు లోకమంతా మారుమోగుతోంది. అత‌ని పేరు బ‌య‌టికిరావ‌డంతో ఖ‌లీద్ భ‌ద్ర‌త ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.
First Published:  20 May 2015 1:00 AM GMT
Next Story