Telugu Global
NEWS

ట్యాంకుల నిండా పెట్రోలు నింపొద్దు

ఎండ‌లు మండిపోతున్నాయి. కాలిన‌డ‌క‌న వెళ్ళేవారు ఉద‌యం 9 గంట‌ల‌య్యిందంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక వాహ‌నాల్లో వెళ్ళేవారు ఏసీలు ఉంటేనే బ‌య‌టికి రాగ‌లుగుతున్నారు. అటు తెలంగాణ‌లోను, ఆంద్ర‌ప్ర‌దేశ్‌ల‌ను కూడా భానుడి భ‌గ‌భ‌గ‌లు పెరిగిపోయాయి. రోహిణి కార్తె రాకుండానే భానుడి ప్ర‌తాపం ఇలా ఉండ‌డంతో ఇక రోహిణి ప్ర‌వేశిస్తే ఎలా ఉంటుందోన‌ని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డి పోతున్నారు. ఎండాకాలం… దీంతోపాటు మారిన వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయిల్ కంపెనీలు పెట్రోలు వినియోగ‌దారులకు విలువైన సూచ‌న‌లు చేశాయి. త‌మ వాహ‌నాల్లో పెట్రోలు నింపుకునే స‌మ‌యంలో […]

ట్యాంకుల నిండా పెట్రోలు నింపొద్దు
X
ఎండ‌లు మండిపోతున్నాయి. కాలిన‌డ‌క‌న వెళ్ళేవారు ఉద‌యం 9 గంట‌ల‌య్యిందంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక వాహ‌నాల్లో వెళ్ళేవారు ఏసీలు ఉంటేనే బ‌య‌టికి రాగ‌లుగుతున్నారు. అటు తెలంగాణ‌లోను, ఆంద్ర‌ప్ర‌దేశ్‌ల‌ను కూడా భానుడి భ‌గ‌భ‌గ‌లు పెరిగిపోయాయి. రోహిణి కార్తె రాకుండానే భానుడి ప్ర‌తాపం ఇలా ఉండ‌డంతో ఇక రోహిణి ప్ర‌వేశిస్తే ఎలా ఉంటుందోన‌ని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డి పోతున్నారు. ఎండాకాలం… దీంతోపాటు మారిన వాతావ‌ర‌ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయిల్ కంపెనీలు పెట్రోలు వినియోగ‌దారులకు విలువైన సూచ‌న‌లు చేశాయి. త‌మ వాహ‌నాల్లో పెట్రోలు నింపుకునే స‌మ‌యంలో ట్యాంకు నిండా నింపుకోవ‌ద్ద‌ని, ప్ర‌స్తుత ఉష్ణోగ్ర‌త‌ల ప్ర‌భావంగా ట్యాంకుల నిండా పెట్రోలు ఉంటే అవి పేలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చేయాలంటే వినియోగ‌దారులు ఈ జాగ్ర‌త్త తీసుకోవాల‌ని ఆయిల్ కంపెనీలు ముందుజాగ్ర‌త్త‌గా సూచించాయి. పెట్రోలు ట్యాంకుల నిండా నింప‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగి ఐదుగురు ఇప్ప‌టివ‌ర‌కు చ‌నిపోయార‌ని ఆయిల్ కంపెనీలు వివ‌రించాయి.
First Published:  21 May 2015 3:37 AM GMT
Next Story