Telugu Global
Others

మేలు చేసే మిర్చి

ప‌చ్చిమిర్చి అన‌గానే న‌షాళాన్నంటే కార‌మే గుర్తుకొస్తుంది. కానీ ప‌చ్చిమిర్చి శ‌క్తినిచ్చే కార్బోహైడ్రేట్ల‌కి, ప్రొటీన్ల‌కి పెట్టింది పేరు. – మిర్చిలో విట‌మిన్ ఎ, సి ల‌తో పాటు ర‌క్త హీన‌త రాకుడా చేసే ఇనుము, గుండె జ‌బ్బులు రాకుండా చేసే పొటాషియం ఉన్నాయి. – క్యాన్స‌ర్‌తో పోరాడే బీటా కెరొటిన్ వంటి పోష‌కాలున్నాయి. – ప‌చ్చిమిర‌ప‌లో ఉండే పోష‌కాలు అజీర్తి స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా కాపాడ‌తాయి. క్యాల‌రీల‌ను క‌రిగించి జీవ క్రియ‌లు వేగంగా జ‌రిగేట్టు చూస్తాయి. – ఆర్థ‌రైటిస్ తో […]

మేలు చేసే మిర్చి
X
ప‌చ్చిమిర్చి అన‌గానే న‌షాళాన్నంటే కార‌మే గుర్తుకొస్తుంది. కానీ ప‌చ్చిమిర్చి శ‌క్తినిచ్చే కార్బోహైడ్రేట్ల‌కి, ప్రొటీన్ల‌కి పెట్టింది పేరు.
– మిర్చిలో విట‌మిన్ ఎ, సి ల‌తో పాటు ర‌క్త హీన‌త రాకుడా చేసే ఇనుము, గుండె జ‌బ్బులు రాకుండా చేసే పొటాషియం ఉన్నాయి.
– క్యాన్స‌ర్‌తో పోరాడే బీటా కెరొటిన్ వంటి పోష‌కాలున్నాయి.
– ప‌చ్చిమిర‌ప‌లో ఉండే పోష‌కాలు అజీర్తి స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా కాపాడ‌తాయి. క్యాల‌రీల‌ను క‌రిగించి జీవ క్రియ‌లు వేగంగా జ‌రిగేట్టు చూస్తాయి.
– ఆర్థ‌రైటిస్ తో బాధ‌ప‌డేవారు త‌గిన మోతాదులో ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు ఆహారంలో తీసుకుంటే ఉప‌శ‌మ‌నం పొందుతారు.
– ప‌చ్చిమిర‌ప‌లో పుష్క‌లంగా ఉండే ఎ విట‌మిన్ మెరుగైన కంటిచూపున‌కు దోహ‌ద‌ప‌డుతుంది.
– ఎముక‌లు, దంతాలు బ‌లంగా ఉండ‌డానికి సాయ‌ప‌డుతుంది.
– ప‌చ్చిమిర్చిలో ఉండే కాప్సాసిన్ కీళ్ల‌నొప్పులు, త‌ల‌నొప్పి వంటివాటిని త‌గ్గిస్తుంది.
– స్థూల‌కాయం ఉన్న వాళ్లు బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.
– పాంక్రియాస్‌లోని న‌రాల‌పై ప‌నిచేసి ఆ క‌ణాలు ఇన్సులిన్ త‌యారు చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.
First Published:  20 May 2015 9:53 PM GMT
Next Story