Telugu Global
National

సునంద పుష్క‌ర్ హ‌త్య‌ కేసు.. 

శ‌శిథ‌రూర్ అనుచ‌రుల‌కు లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు..! సునంద పుష్క‌ర్ హ‌త్య‌ కేసులో పోలీసులు ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు వేశారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఆమె భ‌ర్త కాంగ్రెస్ జాతీయ నేత‌, మాజీ కేంద్ర మంత్రి, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ అనుచరుల‌కు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. శ‌శి థ‌రూర్ వంట మ‌నిషి నారాయ‌ణ్ సింగ్‌, డ్రైవ‌ర్ భ‌జ‌రంగ్‌, స్నేహితుడు సంజ‌య్ ధ‌వాన్‌లకు పోలీసులు నిజ‌నిర్ధార‌ణ కోసం లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. కేసుకు సంబంధించి […]

సునంద పుష్క‌ర్ హ‌త్య‌ కేసు.. 
X
శ‌శిథ‌రూర్ అనుచ‌రుల‌కు లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు..!
సునంద పుష్క‌ర్ హ‌త్య‌ కేసులో పోలీసులు ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు వేశారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ఆమె భ‌ర్త కాంగ్రెస్ జాతీయ నేత‌, మాజీ కేంద్ర మంత్రి, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ అనుచరుల‌కు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. శ‌శి థ‌రూర్ వంట మ‌నిషి నారాయ‌ణ్ సింగ్‌, డ్రైవ‌ర్ భ‌జ‌రంగ్‌, స్నేహితుడు సంజ‌య్ ధ‌వాన్‌లకు పోలీసులు నిజ‌నిర్ధార‌ణ కోసం లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. కేసుకు సంబంధించి అన్ని విష‌యాలు తెలిసినా.. ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఢిల్లీ పోలీసులు కోర్టుకు విన్న‌వించారు. వారికి లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తించాల‌ని కోరారు. ఢిల్లీ కోర్టు ఈ మేర‌కు పోలీసుల‌కు బుధ‌వారం అనుమ‌తి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.
సునంద‌ది హ‌త్యే!
2014, జ‌న‌వ‌రి 17న ఢిల్లీలోని చాణ‌క్య‌పురిలో లీలా ప్యాలెస్ హోటెల్ లో సునంద పుష్క‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. తొలుత ఆమెది ఆత్మ‌హ‌త్య‌గా భావించిన పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దాన్ని హ‌త్య కేసుగా మార్చారు. దీంతో కేసు కొత్త‌మ‌లుపు తిరిగింది. అప్ప‌టి నుంచి అనేక కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ కేసులో శ‌శిథ‌రూర్‌ను, అత‌ని ప‌నిమనిషి నారాయ‌ణ్‌సింగ్‌ను పోలీసులు ప‌లుమార్లు ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారంలో ఐపీఎల్ ఫిక్సింగ్‌, పాక్ విలేక‌రి మెహ‌ర్ త‌రార్ (ఈమెను పాకిస్తాన్ గూఢ‌చారిగా చ‌నిపోయే ముందురోజు సునంద ఆరోపించారు) పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. సునంద పుష్క‌ర్‌, శ‌శి థ‌రూర్ ఇద్ద‌రికీ ఇది మూడో వివాహం కావ‌డం గ‌మ‌నార్హం. సునంద‌ కేసులో ప్ర‌ముఖ బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి శ‌శిథ‌రూర్‌కు వ్య‌తిరేకంగా 2015 జ‌న‌వరిలో న్యాయ‌పోరాటం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం విశేషం. ఈ కేసులో లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌ల ద్వారా మ‌రింత స‌మాచారం దొర‌క‌వ‌చ్చ‌ని పోలీసు శాఖ ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. సునంద‌ది హ‌త్య అని తేలిన క్ర‌మంలో ఇక నిందితులు ఎవ‌రు? హ‌త్య‌కు ముందు ఆమె ఎవ‌రిని క‌లిశారు? ఎవ‌రితో ఏమేం..మాట్లాడారు..? చ‌నిపోయే ముందు ట్విట్ట‌ర్‌లో ఆమె పెట్టిన వ్యాఖ్య‌ల వెన‌క అంత‌రార్థం ఏంటి..? త‌దిత‌ర విష‌యాలు తెలిస్తే.. కేసులో సంచ‌ల‌నాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.
First Published:  21 May 2015 1:40 AM GMT
Next Story