గోదావ‌రిలో ప‌డిన బ‌స్సు-ముగ్గురి దుర్మ‌ర‌ణం

ఖ‌మ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. కొత్త‌గూడెం నుంచి భ‌ద్రాచ‌లం వెళుతున్న ఆర్టీసీ బ‌స్సు గోదావ‌రి దాపులో ఉన్న గోతిలో ప‌డిపోయింది. ఈ సంఘ‌ట‌న‌లో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న‌ప్పుడు చ‌ని పోయారు. మ‌రో 30 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో ప‌ది మంది ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. చ‌నిపోయిన ముగ్గురిలో ఒక‌రు మ‌హిళ‌గా చెబుతున్నారు. మొత్తం బ‌స్సులో 40 మంది ఉన్న‌ట్టు తెలుస్తోంది. బూర్గంపాడు మండ‌లం సార‌పాక వ‌ద్ద వంతెన‌ను ఢీకొని బ‌స్సు గోదావ‌రిని ఆనుకుని ఉన్న లోయ‌లో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌ను భ‌ద్రాచ‌లం, పాల్వంచ‌, ఖ‌మ్మం ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. అవ‌స‌ర‌మైతే క్ష‌త‌గాత్రుల‌ను హైద‌రాబాద్ త‌ర‌లించ‌వ‌ల‌సిందిగా క‌లెక్ట‌ర్ ఆదేశించారు.