Telugu Global
NEWS

ఆర్టీసీ ఛార్జీలు పెంపున‌కు టి.సర్కార్ రెడీ..

అనుకున్నదే అయ్యింది..త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి.  ఆర్టీసీ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. డీజిల్ ధరలు పెరగడం… సిబ్బంది జీతాలు అధికం కావడం వల్లే ధరలు పెంచాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఆర్టీసీ బస్సులకు పన్నులు వసూలు చేస్తామని, ఈనెల 28 నుండి వేర్వేర్వుగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. దశల వారీగా ఆర్టీసీ ఛార్జీల ధరలను పెంచుతామని ఇటీవలే సీఎం […]

ఆర్టీసీ ఛార్జీలు పెంపున‌కు టి.సర్కార్ రెడీ..
X
అనుకున్నదే అయ్యింది..త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆర్టీసీ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. డీజిల్ ధరలు పెరగడం… సిబ్బంది జీతాలు అధికం కావడం వల్లే ధరలు పెంచాల్సి వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఆర్టీసీ బస్సులకు పన్నులు వసూలు చేస్తామని, ఈనెల 28 నుండి వేర్వేర్వుగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. దశల వారీగా ఆర్టీసీ ఛార్జీల ధరలను పెంచుతామని ఇటీవలే సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు ఛార్జీలు పెంచడానికి అనుమతి ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వానికి యాజమాన్యం విన్నపాలు చేస్తూ వచ్చింది. కానీ దీనిని ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇటీవలే 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మె చేసి విజయం సాధించారు. వీరికి 44 శాతం ఫిట్మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో కేంద్రం డీజిల్ ధరలను పెంచింది. దీనితో ధరల పెరుగుదల..వేతనాలు అధికం కావడం వల్ల ఆర్టీసీ సంస్థపై పెనుభారం పడుతోందని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళుతుందని దీనికి ఆర్టీసీ ఛార్జీలు పెంచడమే శరణ్యమని యాజమాన్యం భావించింది. దీనిపై ఓ కమిటీని నియమించారు. ఆర్టీసీ ఛార్జీలు ఎంత మేరకు పెంచాలనే దానిపై ఈ కమిటీ నివేదిక అందచేయనుంది. ఈ నివేదికను ప్రభుత్వానికి అంద చేసిన తరువాత ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా 15 శాతం పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ నష్టాల్లో ఉండడానికి కారణం ప్రభుత్వ విధానాలే కారణమని పలు కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. డీజిల్ ధరల పెరుగుదల, వేతనాల పెంపును సాకుగా చూపెట్టి ఆర్టీసీ ఛార్జీల పెంచడానికి చూస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిపుణులు..తాము సూచించిన విధానాలు అవలంబిస్తే నష్టాల నుండి బయట పడొచ్చని పేర్కొంటున్నారు.
First Published:  21 May 2015 5:34 AM GMT
Next Story