Telugu Global
Cinema & Entertainment

సల్మాన్-కరీనా కలిసి ప్రయాణించిన వేళ

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ మధ్య ఎలాంటి ఎఫైర్లు లేవు. పెళ్లికి ముందు కూడా కరీనా కపూర్ కు సల్మాన్ తో డేటింగ్ లాంటి రూమర్లు లేవు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. సల్మాన్ ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కరీనాకపూర్. అంతేకాదు.. కేవలం సల్మాన్ ఖాన్ సినిమాల్లో మాత్రమే ఐటెంసాంగ్స్ చేస్తానని కూడా ఈమధ్య ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి భజరంగీ భాయ్ జాన్ అనే సినిమా చేస్తున్నారు. […]

సల్మాన్-కరీనా కలిసి ప్రయాణించిన వేళ
X
సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ మధ్య ఎలాంటి ఎఫైర్లు లేవు. పెళ్లికి ముందు కూడా కరీనా కపూర్ కు సల్మాన్ తో డేటింగ్ లాంటి రూమర్లు లేవు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. సల్మాన్ ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కరీనాకపూర్. అంతేకాదు.. కేవలం సల్మాన్ ఖాన్ సినిమాల్లో మాత్రమే ఐటెంసాంగ్స్ చేస్తానని కూడా ఈమధ్య ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి భజరంగీ భాయ్ జాన్ అనే సినిమా చేస్తున్నారు. తన ప్రతి సినిమాకు కరీనాకు ఓ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చే సల్మాన్.. ఈసారి కూడా అదే పని చేశాడు. శ్రీనగర్ లో షూటింగ్ పూర్తిచేసుకొని ఇద్దరూ కలిసి ముంబయి వచ్చారు. దారిలో కరీనాకు సల్మాన్ ఓ కాస్ట్ లీ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. దాదాపు 20లక్షల రూపాయల ఖరీదు చేసే ఆ వాచ్ ను చూసుకొని మురిసిపోయింది కరీనాకపూర్. కేవలం కరీనాకు మాత్రమే కాదు.. తనతో పనిచేసిన హీరోయిన్లు, డైరక్టర్లకు అప్పుడప్పుడు సర్ ప్రైజింగ్ గిఫ్టులు ఇవ్వడం సల్మాన్ హాబీ.
First Published:  21 May 2015 12:17 AM GMT
Next Story