లోకనాయ‌కుడు ఏం చేస్తాడో…!

నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ కి ఈ మధ్య‌ అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సినిమాలు చేయడానికి ఫాస్ట్ గానే చేస్తున్నాడు కాని, వాటిని రిలీజ్ చేయడానికి మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. విశ్వరూపం, ఉత్తమ విలన్ సినిమాలే ఇందుకు నిదర్శనం. ఒక్క కమల్ కే ఇటువంటి ఇబ్బంది వస్తుంది అంటే ఈ విషయం గురించి బాగా ఆలోచించుకోవాలి ఒకసారి. ఇక విశ్వరూపం ఫెయిల్ అవ్వడంతో వెంటనే విశ్వరూపం 2 తీసేసాడు కమల్. ఇక ఈ సినిమాను నిర్మించిన రవిచంద్రన్ ఈ మద్య బాగా ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకే ఈ విశ్వరూపం 2 విడుదల లేట్ అవుతుంది. ఇక ఈ సినిమా లేట్ అయితే తన మార్కెట్ కూడా పోతుంది అని కమల్ భావించాడో ఏమో, ఈ సినిమాను తానే సొంతగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసి జూలై నెలలో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈసారి అయిన కమల్ కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయో లేదో చూడాలి..!