Telugu Global
Others

భార‌త‌దేశంలో ఉగ్ర న‌గ‌రాలు?

భార‌త‌దేశంలో రెండు న‌గ‌రాలు ఉగ్ర‌వాదుల‌కు కేంద్రంగా మారే ప్ర‌మాద‌ముంద‌ని ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉగ్ర‌వాద దాడుల‌కు ఎక్కువ‌గా అవ‌కాశ‌మున్న ప్ర‌పంచంలోని 1300 వాణిజ్య కేంద్రాలు, న‌గ‌రాల‌పై వెరిస్క్ మాప్లిక్రాఫ్ట్ అనే సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యాలు తెలిశాయి. ఈ జాబితా ప్ర‌కారం దేశ స‌రిహ‌ద్దు ప్రాంతాలైన ఇంఫాల్ 32, శ్రీ‌న‌గ‌ర్ 49 స్థానాల్లో నిలిచాయి. ఈ ర్యాంకులు ఆయా న‌గ‌రాల్లో తీవ్ర‌వాదుల కార్య‌క‌లాపాల‌ను చెప్ప‌క‌నే చెబుతున్నాయి. ఈ జాబితాలో బెంగ‌ళూరు 204, పుణె 206లో […]

భార‌త‌దేశంలో ఉగ్ర న‌గ‌రాలు?
X
భార‌త‌దేశంలో రెండు న‌గ‌రాలు ఉగ్ర‌వాదుల‌కు కేంద్రంగా మారే ప్ర‌మాద‌ముంద‌ని ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉగ్ర‌వాద దాడుల‌కు ఎక్కువ‌గా అవ‌కాశ‌మున్న ప్ర‌పంచంలోని 1300 వాణిజ్య కేంద్రాలు, న‌గ‌రాల‌పై వెరిస్క్ మాప్లిక్రాఫ్ట్ అనే సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యాలు తెలిశాయి. ఈ జాబితా ప్ర‌కారం దేశ స‌రిహ‌ద్దు ప్రాంతాలైన ఇంఫాల్ 32, శ్రీ‌న‌గ‌ర్ 49 స్థానాల్లో నిలిచాయి. ఈ ర్యాంకులు ఆయా న‌గ‌రాల్లో తీవ్ర‌వాదుల కార్య‌క‌లాపాల‌ను చెప్ప‌క‌నే చెబుతున్నాయి. ఈ జాబితాలో బెంగ‌ళూరు 204, పుణె 206లో ఉండ‌గా హైద‌రాబాద్ 207 స్థానంలో నిలిచాయి. మొత్తం మీద తొలి ఆరుస్థానాల‌ను ఇరాక్ కైవ‌సం చేసుకోగా పొరుగుదేశం పాకిస్థాన్ లోని న‌గ‌రాలు 7., 9, 10 స్థానాల్లో నిలిచాయి. మొత్తం మీద మ‌ధ్య ప్రాశ్చ్యం, ఆసియాలోని 64 న‌గ‌రాలకు తీవ్ర‌వాదుల తీవ్ర‌ ముప్పు పొంచి ఉంద‌ని హెచ్చ‌రించింది. ఇందులో మూడు యూరోప్‌కు చెందిన‌వి ఉండ‌టం గ‌మ‌నార్హం.
First Published:  22 May 2015 1:28 AM GMT
Next Story