Telugu Global
Cinema & Entertainment

అజహారుద్దీన్  ఫ‌స్ట్ లుక్  వ‌చ్చేసింది.

గొప్ప క్రికెట‌ర్స్‌లో అజ్జు భాయ్ ఒక‌రు. ఒక పేద కుటుంబం నుంచి వ‌చ్చిన అజ‌హారుద్దీన్  స్వ‌యం కృషి తో దేశం గ‌ర్వించ ద‌గ్గ  క్రీడాకారుడ‌య్యాడు.  టీమ్ ఇండియాకు కేప్ట‌న్‌గా  ఎన్నో విజ‌యాలు అందించి చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఒక పేజి క్రియేట్ చేసుకున్నాడు. అయితే చివ‌రి ద‌శ‌లో మ్యాచ్ ఫిక్సింగ్  మ‌చ్చతో   త‌న కీర్తీ ప్ర‌తిష్ట‌లు మ‌స‌క బార్చుకున్నాడు. ఆ త‌రువాత రాజ‌కీయాల్లో ఎంట్రి ఇచ్చి పార్ల‌మెంట్ స‌భ్యుడ‌య్యారు. మొద‌టి భార్యకు డైవోర్స్ ఇచ్చి ప్ర‌ముఖ మోడ‌ల్ […]

అజహారుద్దీన్  ఫ‌స్ట్ లుక్  వ‌చ్చేసింది.
X
గొప్ప క్రికెట‌ర్స్‌లో అజ్జు భాయ్ ఒక‌రు. ఒక పేద కుటుంబం నుంచి వ‌చ్చిన అజ‌హారుద్దీన్ స్వ‌యం కృషి తో దేశం గ‌ర్వించ ద‌గ్గ క్రీడాకారుడ‌య్యాడు. టీమ్ ఇండియాకు కేప్ట‌న్‌గా ఎన్నో విజ‌యాలు అందించి చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఒక పేజి క్రియేట్ చేసుకున్నాడు. అయితే చివ‌రి ద‌శ‌లో మ్యాచ్ ఫిక్సింగ్ మ‌చ్చతో త‌న కీర్తీ ప్ర‌తిష్ట‌లు మ‌స‌క బార్చుకున్నాడు. ఆ త‌రువాత రాజ‌కీయాల్లో ఎంట్రి ఇచ్చి పార్ల‌మెంట్ స‌భ్యుడ‌య్యారు. మొద‌టి భార్యకు డైవోర్స్ ఇచ్చి ప్ర‌ముఖ మోడ‌ల్ సంగీత బిజ్లానీని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇలా అజహార్ బ‌యో గ్ర‌ఫిలో ఎన్నో ఉథ్ధాన‌ ప‌త‌నాలు ఉన్నాయి. అందుకే ఏక్త క‌పూర్ అజ్జుభాయ్ జీవిత చ‌రిత్ర‌ను ఆయ‌న పేరు తోనే సినిమా గా నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హ‌ష్మీ లీడ్ రోల్ చేస్తుండ‌గా.. అజహారుద్దీన్ మొద‌టి భార్య రోల్‌ను ప్రాచీ దేశాయ్ చేస్తున్నారు. సెకండ్ వైఫ్ రోల్‌ను న‌ర్గీస్ ఫ‌క్రి చేస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. వ‌చ్చే యేడాది మే నెల‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తార‌ని తెలిపారు. గ‌తంలో భాగ్ మిల్కా భాగ్.. మేరి కోమ్ వంటి ఆటో బ‌యోగ్ర‌పిలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఏక్తా క‌పూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు టాక్.
First Published:  22 May 2015 7:00 AM GMT
Next Story