Telugu Global
Others

హిస్ట్రక్టమీ ఆపరేషన్‌కు 45 రోజుల అదనపు సెలవులు

మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయినులు హిస్ట్రక్టమీ ఆపరేషన్‌ చేయించుకుంటే అదనంగా 45 రోజుల సెలవులు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వ కల్పించింది. ఈ సెలవులకు తక్షణం జీతం కూడా చెల్లిస్తారు. గర్భసంచి తొలగించడానికి చేయించుకునే ఈ ఆపరేషన్‌కు గతంలో సాధారణ సెలవులు, మెడికల్‌ లీవులు వినియోగించుకునే వారు. కానీ 1.4.2011న విడుదల చేసిన 52 నంబర్‌ ఉత్తర్వుల మేరకు వీరికి 45 రోజుల ప్రత్యేక సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇతర సెలవులతో సంబంధం లేకుండా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆపరేషన్‌ […]

మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయినులు హిస్ట్రక్టమీ ఆపరేషన్‌ చేయించుకుంటే అదనంగా 45 రోజుల సెలవులు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వ కల్పించింది. ఈ సెలవులకు తక్షణం జీతం కూడా చెల్లిస్తారు. గర్భసంచి తొలగించడానికి చేయించుకునే ఈ ఆపరేషన్‌కు గతంలో సాధారణ సెలవులు, మెడికల్‌ లీవులు వినియోగించుకునే వారు. కానీ 1.4.2011న విడుదల చేసిన 52 నంబర్‌ ఉత్తర్వుల మేరకు వీరికి 45 రోజుల ప్రత్యేక సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇతర సెలవులతో సంబంధం లేకుండా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆపరేషన్‌ జరిగినట్టు సివిల్‌ సర్జన్‌ సర్టిఫికెట్‌ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయంతో మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయినులకు ఎంతో వెసులుబాటు ఉంటుంది.
First Published:  21 May 2015 1:04 PM GMT
Next Story