Telugu Global
NEWS

మే 31కి ఓటరు కార్డుతో ఆధార్‌ లింకు పూర్తి : భన్వర్‌లాల్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 31 నాటికి ఓటరు కార్డులతో ఆధార్‌ నెంబర్ల అనుసంధానం పూర్తవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఈ అనుసంధానంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఆధార్‌ లేకపోయినా సరే ఓటరు కార్డు ఉంటే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో ఆధార్‌ సీడింగ్‌ 84 శాతం మేర పూర్తయిందన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో దాదాపు 100 శాతం ఆధార్‌ […]

మే 31కి ఓటరు కార్డుతో ఆధార్‌ లింకు పూర్తి : భన్వర్‌లాల్‌
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 31 నాటికి ఓటరు కార్డులతో ఆధార్‌ నెంబర్ల అనుసంధానం పూర్తవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఈ అనుసంధానంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఆధార్‌ లేకపోయినా సరే ఓటరు కార్డు ఉంటే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో ఆధార్‌ సీడింగ్‌ 84 శాతం మేర పూర్తయిందన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో దాదాపు 100 శాతం ఆధార్‌ సీడింగ్‌ పూర్తికాగా, మిగిలిన జిల్లాల్లో కూడా వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం మాత్రం 57 శాతంతో చివరి స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణలో 76 శాతం వరకు పూర్తయిందని భన్వర్‌లాల్‌ చెప్పారు. వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లా ఆధార్‌సీడింగ్‌లో 99.96 శాతంతో ముందంజంలో ఉండగా, అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌ 29 శాతంతో అన్ని జిల్లాల కంటే వెనుకబడిందని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఆధార్‌తో అనుసంధానం నత్తనడకన కొనసాగుతోందని భన్వర్‌లాల్‌ వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 30 శాతం ఆధార్‌ సీడింగ్‌ మాత్రమే పూర్తయిందని తెలిపారు. ఈ రెండు జిల్లాలు మినహా మిగిలిన తెలంగాణలోని 8 జిల్లాల్లో 90 శాతంపైగా పూర్తయిందని తెలిపారు.
ఎస్సెమ్మెస్‌ ద్వారా కూడా ఓటర్లు తమ ఆధార్‌కార్డును స్వయంగా ఓటర్‌ ఐడీతో లింక్‌ చేసుకోవచ్చని చెప్పారు. SEEDEPIC <EPIC No> <Adhar No> టైప్‌ చేసి 8790499899 నెంబర్‌కి మెసేజ్‌ చేస్తే సరిపోతుందని, అనుసంధానం అయినట్టు తిరుగు మెసేజ్‌ కూడా వస్తుందని తెలిపారు. 1950 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు చెప్పి ఆధార్‌ను ఓటరు ఐడీతో జతచేసుకోవచ్చని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జూన్‌ 6 నాటికి పూర్తిస్థాయి ఓటరు జాబితాను సిద్ధం చేస్తామన్నారు.
First Published:  21 May 2015 9:30 PM GMT
Next Story