Telugu Global
NEWS

ఎర్ర స్మగర్ల వేట‌కు వేగం పెంచిన నిఘా బృందాలు!

విలువైన ఎర్ర చంద‌నం సంపదనను ఇత‌ర రాష్ట్రాల‌కు, విదేశాల‌కు త‌ర‌లించే స్మ‌గ్ల‌ర్ల‌పై స్పెషల్ టీంలు నిఘా వేగవంతం చేశాయి. ఆరు రాష్ట్రాల పోలీసుల సహాకారంతో ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. విచారణలో కొత్త కొత్త పేర్లు బయటపడుతున్నాయి. త్వరలోనే మ‌రికొంత‌మంది బడా స్మగ్లర్ల పేర్లను పోలీసులు బయటపెట్టనున్నార‌ని తెలుస్తోంది. ఇందులో వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఎర్ర చంద‌నం సిరుల పంట పండించ‌డం వ‌ల్లే స్మ‌గ్ల‌ర్లు ఈ అక్ర‌మ వ్యాపారంపై దృష్టి పెట్టి […]

ఎర్ర స్మగర్ల వేట‌కు వేగం పెంచిన నిఘా బృందాలు!
X
విలువైన ఎర్ర చంద‌నం సంపదనను ఇత‌ర రాష్ట్రాల‌కు, విదేశాల‌కు త‌ర‌లించే స్మ‌గ్ల‌ర్ల‌పై స్పెషల్ టీంలు నిఘా వేగవంతం చేశాయి. ఆరు రాష్ట్రాల పోలీసుల సహాకారంతో ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. విచారణలో కొత్త కొత్త పేర్లు బయటపడుతున్నాయి. త్వరలోనే మ‌రికొంత‌మంది బడా స్మగ్లర్ల పేర్లను పోలీసులు బయటపెట్టనున్నార‌ని తెలుస్తోంది. ఇందులో వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఎర్ర చంద‌నం సిరుల పంట పండించ‌డం వ‌ల్లే స్మ‌గ్ల‌ర్లు ఈ అక్ర‌మ వ్యాపారంపై దృష్టి పెట్టి దండుకుంటున్నారు. దీన్ని రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటిస్తూ… కోట్లు సంపాదిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా ఈ శాండిల్‌వుడ్ తరలిస్తున్న వారిని ఊచలు లెక్కించేలా చేస్తోంది. ప్రస్తుతం ఎర్రచందనం అక్రమ రవాణలో ఒక్కొక్కరి పేర్లు బయటపడుతున్నాయి. తీగ లాగితే డొంక కదులుతోంది. ఎర్రచందనం కేసులో అరెస్ట్‌ అయిన వారిలో నలుగురిపై ఇప్ప‌టికే పీడీ యాక్ట్ సంధించారు. బలమైన ఆధారాలను సేకరించి.. మరికొందరిపై కూడా పీడీ యాక్టు పెట్టనున్నారు. పది రోజుల క్రితం చైనాకు చెందిన బడా స్మగ్లర్ యాంగ్‌పింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత కస్టడిలోకి తీసుకుని విచారించారు. యాంగ్‌పింగ్ ఇచ్చిన సమాచారంతో హర్యానాకు చెందిన ముఖేష్ బ‌దానీని స్పెషల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన స‌మ‌యంలో అనేక విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. అత‌న్ని కోర్టులో హాజ‌రుప‌రిచి 14 రోజుల రిమాండ్ తీసుకున్నారు. ఇపుడు మ‌రింత క్రియాశీలంగా అత‌న్ని విచారిస్తున్నారు.
హర్యానాలో అరెస్ట్‌ అయిన ముఖేష్‌.. బ‌దానీ చిత్తూరు, కడప, కర్నూలు నుంచి తెచ్చిన ఎర్రచందనాన్ని… హైదరాబాద్ -కొంపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో దాచేవాడు. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు దుంగలను తరలించి అక్కడ నుంచి చైనాకు, దుబాయికి అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ముఖేష్‌ను అరెస్ట్ చేసే స‌మ‌యంలోనే అత‌నికి చెందిన గోడౌన్ నుంచి 12 కోట్ల విలువైన చంద‌నం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. విచార‌ణ త‌ర్వాత మ‌రో రూ. 14 కోట్ల దుంగ‌ల‌ను క‌నిపెట్టారు. త‌ర్వాత మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌కు చెందిన గూడూరు మాధవరెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఎర్ర చందనం కేసులో గత మూడు నెలల్లో 30 మంది బడా స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బద్వేల్‌లో మల్లికార్జున, మల్లేష్, విజయ నర్సింహారెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు స్మగ్లర్లు ఏపీ, తమిళనాడు, కర్ణాట‌క‌లో మాత్రమే ఉన్నారని అనుకున్న పోలీసులు.. హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్‌లోనూ రెడ్‌ శాండిల్‌ దొంగలు ఉన్నట్లు గుర్తించారు. ఈ రాష్ట్రాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచే ఎర్ర చంద‌నం వెళుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించారు. ఒక స్మగ్లరు అరెస్ట్ అయితే అతని ఇచ్చిన సమాచారంతో ఫోన్ నెంబర్ ట్రెస్ చేసి.. కాల్ డేటా ఆధారంగా మ‌రికొంత‌మంది స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. చంద‌నం త‌ర‌లింపులో కూడా అనేక ర‌కాలైన వేషాలేస్తున్నారు స్మ‌గ్ల‌ర్లు. దుంగ‌ల‌ను యాధావిధిగా కాకుండా వాటి రూపం మార్చి ఎగుమ‌తి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రుద్రాక్ష రూపంలో ఎర్ర చందనం చిన్న చిన్నముక్క‌లుగా చేసి ముఖేష్‌ చైనా పంపించే వాడని తెలిసింది. కొందరు పొడిగా చేసి విదేశాలకు తరలించారు. ఇలా ర‌క‌ర‌కాల మార్గాల్లో ఎర్ర చంద‌నాన్ని ఎగుమ‌తి చేస్తూ కోట్లు మూట‌గ‌ట్టుకుంటున్నారు స్మ‌గ్ల‌ర్లు.-పీఆర్‌
First Published:  22 May 2015 5:37 AM GMT
Next Story